Home /News /politics /

YSRCPS VAJAISAI REDDY SLAMS CHANDRABABU NAIDU OVER HIS COMMENTS ON YS JAGAN LONDON TOUR

ఎవరు బెదిరిస్తే హైదరాబాద్ నుంచి పారిపోయారు?..చంద్రబాబుకు విజయసాయి ప్రశ్న

విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)

విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)

పలు అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లతో విరుచుకపడ్డారు. ఎవరు బెదిరిస్తే 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి చంద్రబాబు పారిపోయి వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

    వరుస ట్వీట్లతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకపడ్డారు. టిడిపి నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరమని హైదరాబాద్‌లో బెదిరిస్తున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎవరు బెదిరించడం వల్ల 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ని వదిలేసి రాత్రికి రాత్రి సర్దుకొచ్చారని చంద్రబాబుని విజయసాయి సూటిగా ప్రశ్నించారు.  మీకు ప్రపంచమంతా ఆస్తులున్నాయని, మరి ఎవరైనా మిమ్మల్ని బెదిరించారా? అని ధ్వజమెత్తారు.



    హవాలా సొమ్ము తెచ్చుకునేందుకే వైఎస్ జగన్ లండన్ పర్యటనకు వెళ్లారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై విరుచుకపడ్డారు. స్విస్ బ్యాంకర్లతో పరిచయాలు పెంచుకుని, బ్లాక్ మనీ దాచుకునే మార్గాలను తెలుసుకునేందుకే తండ్రి కొడుకు చంద్రబాబు, నారా లోకేశ్ ఏడాదికొకసారి దావోస్ వెళ్తున్నారని ఆరోపించారు.ఎవరు ఎక్కడికెళ్లినా మీలాంటి అవినీతిపరులకు అనుమానం కలగడంలో వింతలేదని ఎద్దేవా చేశారు.



    జాతీయ మీడియా ప్రీపోల్స్ సర్వేలపై చంద్రబాబు ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారంటూ విజయసాయి మరో ట్వీట్లో ప్రశ్నించారు. మీడియా మేనేజ్‌మెంట్ మీ సబ్జెక్ట్ అంటూ ఎద్దేవా చేశారు.



    మరో ట్వీట్‌లో.. రైతు కోటయ్యను హత్య చేసింది కాక కుటుంబ కలహాలతో చనిపోయాడని ఆయన మరణాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.

    First published:

    Tags: Vijayasai reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు