టీటీడీ 50వ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి... నేడు బాధ్యతల స్వీకరణ

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. నేటి ఉదయం తిరుమలలో టీటీటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

news18-telugu
Updated: June 22, 2019, 5:28 AM IST
టీటీడీ 50వ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి... నేడు బాధ్యతల స్వీకరణ
వైవీ సుబ్బారెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ చట్టం 1987 ప్రకారం టీటీడీకి కొత్త బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ దేవాదాయ శాఖ పేర్కొంది. త్వరలోనే పాలకమండలి సభ్యుల నియామకాలు కూడా చేపట్టనున్నట్టు తెలిపింది. దాంతో పాటు పాత పాలకమండలిని రద్దుచేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసింది ఏపీ సర్కార్. పాలక మండలి సభ్యులుగా సుధా నారాయణమూర్తి, సుగవాసి ప్రసాద్‌బాబు, రుద్రరాజు పద్మరాజు, పెద్దిరెడ్డి, డొక్కా జగన్నాథంతో పాటు పలువురి రాజీనామాలను ఆమోదించింది.

వైవీ సుబ్బారెడ్డి టీటీడీ 50వ ఛైర్మన్‌గా నేడు బాధ్యతలు చేపట్టున్నారు. శుక్రవారం సాయంత్రమే కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో వైసీపీ శ్రేణులు సుబ్బారెడ్డికి ఘనస్వాగతం పలికారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. నేటి ఉదయం తిరుమలలో టీటీటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: June 22, 2019, 5:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading