ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన చంద్రబాబు... అడ్డుకున్న వైసీపీ శ్రేణులు

విశాఖకు రాజధాని రావడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ వైసీపీ శ్రేణులు విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి.

news18-telugu
Updated: February 27, 2020, 12:49 PM IST
ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన చంద్రబాబు... అడ్డుకున్న వైసీపీ శ్రేణులు
చంద్రబాబునాయుడు (File)
  • Share this:
ఉత్తరాంధ్రలో ప్రజాచైతన్య యాత్ర చేపట్టేందుకు విశాఖ చేరుకున్న చంద్రబాబుకు వైసీపీ నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. విశాఖకు రాజధాని రావడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ వైసీపీ శ్రేణులు విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు కాన్వాయ్‌ను ఎయిర్ పోర్టు దగ్గరే అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు... ఆయన కాన్వాయ్‌ను ముందుకు కదలనివ్వడం లేదు. దాదాపు 45 నుంచి చంద్రబాబు కాన్వాయ్ విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గరే నిలిచిపోయింది.

అంతకుముందు విశాఖ ఎయిర్‌పోర్టు హైవే వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ వైసిపి నేతలు ఎయిర్‌పోర్టు హైవే వద్ద ఆందోళనకు దిగారు. చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ... నినాదాలు చేశారు. టిడిపి శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు. దీంతో టిడిపి-వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. రెండు వర్గాలవారు ఒకరిపైఒకరు పోటీపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒక దశలో రెండు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు విశాఖ ఎయిర్‌పోర్టు కు చేరుకున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వాహనాన్ని వైసిపి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అచ్చెన్నాయుడి కారును చుట్టుముట్టారు. కారు ముందు కూర్చొని నినాదాలు చేశారు. ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: February 27, 2020, 12:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading