Home /News /politics /

YSRCP WON GUNTUR MUNICIPAL CORPORATION DESPITE CAPITAL AMARAVATHI AGITATIONS FULL DETAILS HERE PRN

AP Municipal Elections: పనిచేయని రాజధాని నినాదం... గుంటూరులో వైసీపీ విక్టరీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాజధాని (AP Capital) తరలింపుతో గుంటూరులో వైసీపీకి (YSR Congress) ఓటర్లు షాకిస్తారని అందరూ భావించినా.. ప్రజలు మాత్రం అధికార పార్టీకే మద్దతు పలికారు.

    ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కొనసాగుతోంది. పట్టణప్రాంతల ఓటర్లు వైసీపీకి పట్టం కడుతున్నారు. ఐతే రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లపైనే అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతికి దగ్గర్లో ఉన్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గుంటూరులో గెలిచి మూడు రాజధానుల నిర్ణయం తప్పని నిరూపిస్తామని ప్రతిపక్ష టీడీపీ సవాల్ చేసినా.. వైసీపీ మాత్రం అక్కడ విజయం సాధించింది. రాజధాని తరలింపుతో గుంటూరులో వైసీపీకి ఓటర్లు షాకిస్తారని అందరూ భావించినా.. ప్రజలు మాత్రం అధికార పార్టీకే మద్దతు పలికారు. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాటుడు గుంటూరులో ప్రచారం చేసినా ఓటర్లు మాత్రం ఫ్యాన్ గుర్తుపైనే ఓట్లు గుద్దేశారు.

    గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో 57 డివిజన్లు ఉండగా.., వైసీపీ మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. ఎన్నికలకు ముందుగానే వైసీపీ ఒక డివిజన్ ను ఏకగ్రీవం చేసుకోగా.. వైసీపీ 33 డివిజన్లు కైవసం చేసుకోగా.. 4 టీడీపీ, రెండు డివిజన్లలో జనసేన, బీజేపీ రెండు చోట్ల విజయం సాధించాయి. గుంటూరు రూరల్ మండలంలో ఒకే సామాజిక వర్గం అధికంగా ఉన్నచోట జనసేన, బీజేపీకి అధికంగా ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఇక గుంటూరు కార్పొరేషన్ తీర్పుతో రాజధాని ఉద్యమం ఏ మాత్రం ప్రభావం చూపలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజధాని ప్రాంతంలోని గ్రామాల ప్రజలు నిత్యం గుంటూరుకు రాకపోకలు సాగిస్తుంటారు.. రాజధాని ప్రకటన తర్వాత గుంటూరు రాష్ట్రంలోనే ప్రముఖ నగరమైంది. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనలు చేసినా.. ప్రస్తుత ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజంనం సృష్టించడం... గుంటూరు వాసులు తమ నిర్ణయానికే ఓటు వేశారని వైసీపీ నేతలంటున్నారు..

    Latest Municipal Election Result Update news

    గుంటూరు జిల్లాలో కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీలను కూడా వైసీపీ కైవసం చేసుకుంది. రేపల్లె, తెనాలి, వినకొండ, సత్తెనపల్లి మున్సిపాలిటీలను వైసీపీ సొంతం చేసుకుంది. రేపల్లో 28 వార్డులుండగా.. 4 వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. దీంతో 24 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. వైసీపీ ఏకంగా 21 వార్డులు గెలుచుకుంది. టీడీపీ రెండు చోట్ల, ఇండిపెండెంట్ ఒక వార్డులో విజయం సాధించారు.

    ఇది చదవండి:కోనసీమలో జనసేన-వైసీపీ హోరాహోరీ.. పవన్ పార్టీకే అధిక్యం



    అటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ జోరు చూపిస్తోంది. ఇప్పటికే ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు వైసీపీ ఖాతాలో చేరాయి. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లు, ఒంగోలు కార్పొరేషన్, కర్నూలు కార్పొరేషన్, కడప కార్పొరేషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap local body elections, Guntur, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు