వైసీపీ స్వీప్ చేస్తుంది.. జగన్ సీఎం అంటున్న బీజేపీ ఎంపీ

ఓడిపోతామన్న భయంతోనే టీడీపీకి ఓటేస్తే వైసీపీకి వెళుతోందనే ప్రచారం చేశారని చంద్రబాబుపై జీవీఎల్ మండిపడ్డారు.

news18-telugu
Updated: April 12, 2019, 6:35 PM IST
వైసీపీ స్వీప్ చేస్తుంది.. జగన్ సీఎం అంటున్న బీజేపీ ఎంపీ
మే 12న ఆయన తిరిగి హైదరాబాద్ వస్తారు. సుమారు 10 రోజుల పాటు ఆయన లండన్‌లోనే ఉంటారు.
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. ఏపీలో అధికార టీడీపీకి భారీ షాక్ తప్పదని స్పష్టం చేశారు. విజయవాడలో జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడుకు ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. మే 23న ఎన్నికల ఫలితాలు వస్తాయని, జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్న సమయంలో జగన్ సీఎం కావడం ఖాయమని బీజేపీ ఎంపీ చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

pawan kalyan, janasena chief pawan kalyan, pawan kalyan latest news, janasena pawan kalyan, pawan kalyan on india, pak media on pawan kalyan, Pawan Kalyan on war, Pawan Kalyan on India Pak war, పవన్ కళ్యాణ్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ లేటెస్ట్ న్యూస్, జనసేన పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ భారత్ పాక్ యుద్ధం, పవన్ కళ్యాణ్ బీజేపీ, రెండేళ్ల ముందే చెప్పిన బీజేపీ
జీవిఎల్ నరసింహారావు (ఫైల్ ఫొటో)


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మీద జీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించారు. ఓటమి ఖాయమని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబునాయుడు ఆ నెపాన్ని ఎన్నికల కమిషన్ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ మోదీ, జగన్ చెప్పినట్టు పనిచేస్తుందని చంద్రబాబు అనడం సరికాదన్నారు. ఎన్నిక కమిషన్ ఒక స్వతంత్ర వ్యవస్థ అని ఎవరి ‘ఆదేశాలు’ మీద నడిచే వ్యవస్థ కాదన్నారు. మోదీ బయోపిక్‌ను కూడా ఈసీ బ్యాన్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

lok sabha election 2019, ap election 2019, telangana loksabha election 2019, ap leaders cast vote, telangana leaders cast vote, ఏపీ ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు, ఓటు వేసిన ప్రముఖులు
ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్


ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడంపై కూడా జీవీఎల్ స్పందించారు. కొన్నిచోట్ల ఈవీఎంలు పనిచేయలేదని, వెంటనే అధికారులు వాటిని సరిచేశారని చెప్పారు. ఓడిపోతామన్న భయంతోనే టీడీపీకి ఓటేస్తే వైసీపీకి వెళుతోందనే ప్రచారం చేశారని చంద్రబాబుపై జీవీఎల్ మండిపడ్డారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేయడాన్ని చూస్తే ప్రభుత్వం మీద ఎంత కసి ఉందో అర్థం అవుతోందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు భారీ ఎత్తున డబ్బు ఖర్చుపెట్టారని, రౌడీలను దించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని జీవీఎల్ ఆరోపించారు.
First published: April 12, 2019, 6:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading