డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్‌లో సీబీఐ విచారణ... ఇదీ వైసీపీ రియాక్షన్

CBI enquiry on doctor sudhakar issue: చంద్రబాబు డైరెక్షన్‌లో డాక్టర్ సుధాకర్ సైకోలా వ్యవహరించారని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ ఆరోపించారు.

news18-telugu
Updated: May 22, 2020, 8:27 PM IST
డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్‌లో సీబీఐ విచారణ... ఇదీ వైసీపీ రియాక్షన్
డాక్టర్ సుధాకర్, ఎంపీ నందిగం సురేశ్(ఫైల్ ఫోటో)
  • Share this:
డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ స్పందించారు. సీబీఐ విచారణ జరిగితేనే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణలో అన్ని వాస్తవాలు బైటకు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సుధాకర్ వ్యవహారంలో నిజానిర్ధారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు సుధాకర్‌ను అరెస్ట్ చేయడానికి బలమైన సాక్ష్యాధారాలు సీన్ లో కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. హైకోర్టులో వచ్చే తీర్పులు ముందుగానే చంద్రబాబుకు ఎలా తెలుస్తున్నాయని ఎంపీ సురేశ్ ప్రశ్నించారు. చంద్రబాబు కాల్ లిస్ట్ బైట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

చంద్రబాబు కోర్టుల వెంట తిరుగుతారని... తాము ప్రజల వెంట తిరుగుతామని ఆయన వ్యాఖ్యానించారు. దళిత కార్డు వాడి ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లుతున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు సీబీఐని రాష్ట్రానికి రావద్దని జీవో ఇచ్చారని గుర్తు చేసిన వైసీపీ ఎంపీ... ఇప్పుడు ఊసరి వల్లిలా రంగులు మార్చి చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్ లో సుధాకర్ సైకోలా వ్యవహరించారని ఆరోపించారు. చంద్రబాబు ఇలాంటి వేషాలు ఇంకా ఎంతో మందితో వెయిస్తాడని అన్నారు. చంద్రబాబుకు ఈలాంటి విద్యలు కొత్తేమీ కాదని ఎంపీ నందిగం సురేశ్ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.

Published by: Kishore Akkaladevi
First published: May 22, 2020, 6:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading