టీడీపీకి వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్.. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వరుస నిరసనలు, ఆందోళనలు చేయాలని పార్టీ నిర్ణయించింది. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో 13 జిల్లాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు.


Updated: January 24, 2020, 11:07 PM IST
టీడీపీకి వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్.. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (File)
  • Share this:
మూడు రాజధానుల ఏర్పాటుపై శాసన సభ, మండలిలో టీడీపీ వ్యవహరించిన తీరుపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ క్రమంలో టీడీపీ వైఖరికి నిరసనగా పెద్దఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వరుస నిరసనలు, ఆందోళనలకు సిద్ధమవుతోంది. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో 13 జిల్లాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఈ కార్యక్రమాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంచార్జ్ లు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఇందులో భాగంగా శనివారం యూనివర్సిటీల వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయనున్నారు.

కార్యక్రమాల షెడ్యూల్:

25.01.2020:

పార్టీ విద్యార్ధి విభాగం ఆధ్వ‌ర్యంలో అన్ని విశ్వవిద్యాలయాల వద్ద చంద్ర‌బాబు దిష్టిబొమ్మ‌ల ద‌హ‌నం.27.01.2020:
యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో బైక్ ర్యాలీలు, పాద‌యాత్ర‌లు.

28.01.2020:పార్టీ విద్యార్ధి విభాగం ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి - వికేంద్రీక‌ర‌ణపై యూనివ‌ర్సిటీల వ‌ద్ద స‌ద‌స్సులు నిర్వ‌హ‌ణ‌.

29.01.2020:
పార్టీ యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో సంత‌కాల సేక‌ర‌ణ‌.

30.01.2020:
వికేంద్రీక‌ర‌ణ విష‌యంలో టీడీపీ తీరుపై రాష్ట్రప‌తికి పోస్టుకార్డులు పంపే ఉద్య‌మం.

31.01.2020:
తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మూడు ప్రాంతాల జేఏసీ నాయ‌కుల స‌మావేశం.
First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు