ఎన్నికల్లో వైసీపీ ఎన్నివేల కోట్లు ఖర్చుపెట్టిందో లెక్క చెప్పిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం వైసీపీ రూ.8వేల కోట్లు ఖర్చు పెట్టిందని టీడీపీ ఆరోపించింది.

news18-telugu
Updated: April 21, 2019, 8:43 PM IST
ఎన్నికల్లో వైసీపీ ఎన్నివేల కోట్లు ఖర్చుపెట్టిందో లెక్క చెప్పిన టీడీపీ
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 21, 2019, 8:43 PM IST
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం వైసీపీ రూ.8వేల కోట్లు ఖర్చు పెట్టిందని టీడీపీ ఆరోపించింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈ ఆరోపణలు చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.7 కోట్ల నుంచి రూ.8కోట్ల చొప్పున ఖర్చు చేశారని, లోక్‌సభ స్థానాలకు, ఇతర ప్రచారానికి కలిసి మొత్తం రూ.8వేల కోట్లు ఎన్నికల్లో డబ్బుల వరద పారించారని బుద్ధావెంకన్న ఆరోపించారు. జగన్ వస్తాడంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారానికే ప్రజలు భయపడుతున్నారని బుద్ధా వెంకన్న తెలిపారు. సంక్షేమ పథకాలకు, అప్పుల ఊబిలో ఉన్న రాష్టాన్ని కాపాడినందుకు ప్రజలు మరోసారి చంద్రబాబుకు పట్టం కడతారని చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద కూడా బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి చరిత్ర మొత్తం జనసేన ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ వద్ద ఉందని, ఎన్నికల్లో మోదీ ఓడిపోతే, విజయసాయిరెడ్డి జీవితాంతం జైల్లోనే గడపాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ మీద కూడా బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీద చెప్పు విసరడాన్ని బట్టి చూస్తేనే దేశంలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్నికల తర్వాత జీవీఎల్ చేతి సంచి పట్టుకుని దేశం మొత్తం తిరగాల్సి వస్తుందని జోస్యం చెప్పారు.

First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...