చంద్రబాబు టార్గెట్‌గా వైసీపీ మరో వ్యూహం

చిత్తూరు జిల్లాలో టీడీపీని కోలుకోకుండా చేయాలని భావిస్తున్న వైసీపీ... ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలను సైతం తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 6, 2020, 3:57 PM IST
చంద్రబాబు టార్గెట్‌గా వైసీపీ మరో వ్యూహం
చంద్రబాబునాయుడు (File)
  • Share this:
టీడీపీని దెబ్బకొట్టేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్న అధికార వైసీపీ... తాజాగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుపై మరింత ఎక్కువగా ఫోకస్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి ఒక్క చంద్రబాబు తప్ప.. టీడీపీ నుంచి ఎవరూ విజయం సాధించలేకపోయారు. దీంతో జిల్లాలో పార్టీని మళ్లీ గాడిన పెట్టేందుకు అధినేత చంద్రబాబు మరింతగా శ్రమించాల్సి ఉంటుందనే వాదనలు వినిపించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మెరుగైన ఫలితాలు సాధిస్తే... చిత్తూరు జిల్లాలో మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావొచ్చని ఆ పార్టీ నేతలు భావించారు.

అయితే జిల్లాలో టీడీపీని కోలుకోకుండా చేయాలని భావిస్తున్న వైసీపీ... ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలను సైతం తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలిత కుమారితో పాటు మరో మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ టీడీపీకి రాజీనామా చేశారు. వారిద్దరూ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వైసీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారని... ఆయన కూడా అధికార పార్టీలో చేరే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది.

దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నాటికి చిత్తూరు జిల్లాలో మరింతమంది ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీకి హ్యాండ్ ఇచ్చి అధికార పార్టీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదనే ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి ఏపీలో మళ్లీ టీడీపీ బలం పుంజుకునేలా వ్యూహాలు రచిస్తున్న చంద్రబాబును సొంత జిల్లాలోనే దెబ్బకొట్టాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
First published: June 6, 2020, 3:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading