YSRCP SLAMS UNION BUDGET RAJYA SABHA MP CRITICIZED IT AS ELECTION BUDGET AND SLAMS CENTRAL GOVERNMENT HAS NO CONCERN ON ANDHRA PRADESH PRN
Union Budget 2021-22: అదొక్కటి తప్ప మిగతాదంతా చెత్త.. కేంద్ర బడ్జెట్ పై వైసీపీ రియాక్షన్
MP vijayasai Reddy
కేంద్ర ప్రభుత్వం (Central Budget) ప్రవేశపెట్టిన బడ్జెట్ (Union Budget) పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCR Congress Party) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదో అత్యంత చెత్త బడ్జెట్ అని ఆరోపించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పేదలను పూర్తిగా నిరాశపరిచిందని కాంగ్రెస్, టీఎంసీ సహా ఇతర పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మెట్రో రైల్, రైల్వే ప్రాజెక్టులు, ఇతర కేటాయింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను కేంద్రం అస్సలు పట్టించుకోలేదని ఆ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతల విజయసాయి రెడ్డి ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని.., కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారాయాన. గతంలో వచ్చిన బడ్జెట్ కంటే ఇది చాలా చెత్తగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకే కేంద్రం ప్రాధాన్యమిచ్చిందే తప్ప.., మిగిలిన వారిని అస్సలు పట్టించుకోలేదని విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ప్రతి ఏడాది బడ్జెట్ సందర్భంగా విశాఖ, విజయవాడకు మెట్రో రైలు అడుగుతూనే ఉన్నా.. బడ్జెట్లో వాటి ప్రస్తావనే లేదని విజయసాయి రెడ్డి అన్నారు. అలాగే రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు కేటాయించలేదని.., కాంగ్రెస్ హయాంలోనూ ఇలాగే జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఏపీకి వైరాలజీ సెంటర్ కేటాయింపు. ధాన్యం కొనుగోళ్ల బకాయిల చెల్లింపు అంశాలను పట్టించుకోలేదన్నారు.
ఏపీలో త్వరలోనే 26 జిల్లాలు చేయబోతున్నామని.. వాటికి కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయాభివృద్ధి కోసం ఏపీలో ప్రతి రైతుకు ఏడాదికి రూ.13,500 ఇస్తున్నామని ఇందులో కేంద్రం వాటాను రూ.6వేలు నుంచి రూ.10వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి 1300 వ్యాధులు ఉంటే.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి 2వేలకు పైగా వ్యాధులు వస్తున్నాయని వీటికి కూడా కేటాయింపులివ్వాలన్నారు.
కేంద్రం విశాఖపట్నంకు ఒక షిప్పింగ్ హార్బర్ ను కేటాయిస్తే తాము ఇప్పటికే 8 హార్బర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. సంక్షేమ పథకాల విషయంలోనూ కేంద్రం ఏలాంటి పురోగతి చూపించలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్మూనలో భాగంగా నరేగా పనులను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలని కోరినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రూ.35వేల కోట్లు కేటాయించడం ఒక్కటే బడ్జెట్ లో మంచి అంశమన్నారు విజయసాయి రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ సమస్యలను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పట్టించుకోలేదని లోక్ సభలో వైసీపీ పక్ష నేత మిథున్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల ప్రస్తావనే లేదని విమర్శించారు. రోడ్ల అభివృద్ధి, నరేగా నిధుల కేటాయింపులు సరిగా లేకున్నా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా సాధించుకొస్తామన్నారు. రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రమే నిధులివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.