YSRCP SENIOR LEADER PEDDIREDDY RAMACHANDRAREDDY SLAMS LAGADAPATI RAJAGOPAL SURVEY PREDICTIONS ON AP ELECTIONS 2019 AK
లగడపాటి మాటకు విలువలేదు... అప్పట్లో టీఆర్ఎస్పై బెట్టింగ్... వైసీపీ సీనియర్ నేత వ్యాఖ్యలు
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్
ఏపీ ఎన్నికల్లో వైసీపీకి 120 నుంచి 135 సీట్లు వస్తాయని తాము మొదటి నుంచి చెబుతున్నామన్న పెద్దిరెడ్డి... ఫలితాలు కూడా తమకే అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. సర్వే అంచనాల పేరుతో లగడపాటి మరోసారి అందరిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఏపీలో టీడీపీ గెలిచే అవకాశం ఉందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన ఆంధ్రా ఆక్టోపస్, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన వెల్లడించిన సర్వేల్లో వాస్తవం లేదనే విషయం తెలంగాణలో ఆయన వెల్లడించిన సర్వే అంచనాలతోనే తేలిపోయిందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని బెట్టింగ్ చేసి సొమ్ము చేసుకున్న లగడపాటి రాజగోపాల్... సర్వే అంచనాలు మాత్రం మహాకూటమికి అనుకూలంగా వెల్లడించారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
ఎన్నికల్లో వైసీపీకి 120 నుంచి 135 సీట్లు వస్తాయని తాము మొదటి నుంచి చెబుతున్నామన్న పెద్దిరెడ్డి... ఫలితాలు కూడా తమకే అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. సర్వే అంచనాల పేరుతో లగడపాటి మరోసారి అందరిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏపీలో వైసీపీకి 20 నుంచి 22 ఎంపీ సీట్లు వస్తాయన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... కేంద్రంలో తమ మద్దతుతో ఏర్పడే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీకి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికే తమ మద్దతు ఉంటుందని తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని... ఆ విధంగానే తమ కార్యాచరణ కూడా ఉంటుందని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.