ఐటీ దాడులు: పూర్తి పంచనామా పత్రం ఇదే.. ఆ రోజు ఏం జరిగిదంటే..

గత వారం శ్రీనివాస్ రావు ఇంట్లో భారీగా రిజిస్టర్లు, డైరీలు స్వాధీనం చేసుకున్నట్టు పంచనామాలో ఐటీ శాఖ అధికారులు అందులో పేర్కొన్నారు. వాటితో పాటు కొన్ని విలువైన పత్రాలను కూడా సీజ్ చేశారు. ఏబీ సుబ్బారెడ్డి లాకర్లు సీజ్ చేసినట్టు పంచనామాలో పేర్కొన్నారు.

news18-telugu
Updated: July 21, 2020, 6:26 PM IST
ఐటీ దాడులు: పూర్తి పంచనామా పత్రం ఇదే.. ఆ రోజు ఏం జరిగిదంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో ఐటీ దాడుల వ్యవహారం కాకా రేపుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వారం రోజుల క్రితం చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాసరావుతో పాటు పలువురు టీడీపీ నేతల ఇళ్లలో జరిగిన దాడులకు సంబంధించి పోటాపోటీగా పంచనామా కాపీలను బయటకు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ పూర్తిస్థాయి పంచనామా పత్రం బయటకొచ్చింది. గత వారం శ్రీనివాస్ రావు ఇంట్లో భారీగా రిజిస్టర్లు, డైరీలు స్వాధీనం చేసుకున్నట్టు పంచనామాలో ఐటీ శాఖ అధికారులు అందులో పేర్కొన్నారు. వాటితో పాటు కొన్ని విలువైన పత్రాలను కూడా సీజ్ చేశారు. ఏబీ సుబ్బారెడ్డి లాకర్లు సీజ్ చేసినట్టు పంచనామాలో పేర్కొన్నారు.

ఇప్పటికే ఓ పంచనామా కాపీని మీడియాకు సర్క్యులేట్ చేసిన టీడీపీ నేతలు.. శ్రీనివాస్ రావు ఇంట్లో రూ.2వేల కోట్లు సీజ్ చేశారన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. దాడుల్లో 2 వేల కోట్ల రూపాయల వివరాలు వెలుగు చూడలేదని.. కేవలం రెండున్నర లక్షల రూపాయలు, 12 తులాల బంగారం గుర్తించి వాటిపై వివరణ తీసుకున్నారని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని..పరువు నష్టం దావా వేస్తామని విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీకి కౌంటర్‌గా వైసీపీ పూర్తి పంచనామా పత్రాన్ని సోమవారం మీడియాకు విడుదల చేసింది. టీడీపీ నేతలు తమకు కావాల్సిన పత్రాలను మాత్రమే చూపించారని... కానీ అసలు పత్రాల్లో పూర్తి వివరాలు ఉన్నాయని వెల్లడించింది.
Published by: Shiva Kumar Addula
First published: February 17, 2020, 10:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading