YSRCP REBEL MP RAGHURAMA KRISHNAM RAJU WRITES TO PRIME MINSTER NARENDRA MODI TO INTERFERE IN SSC AND INTER EXAMS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
AP SSC, Inter Exams: ప్రధాని మోదీ వద్దకు ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల పంచాయతీ... విద్యార్థులకు ఊరట లభిస్తుందా...?
ఫ్రతీకాత్మక చిత్రం
ఏపీలో టెన్త్, ఇంటర్ (AP SSC Inter Exmas) పరీక్షల వ్యవహారం రాజకీయ మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశం ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) వద్దకు చేరింది.
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. పరీక్షలు రద్దు చేయాలంటూ ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇటు ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు నిర్వహిస్తామంటూ మొండివైఖరితో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ పంచాయతీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు చేరింది. ఏపీలో పరీక్షల నిర్వహణపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రధాని మోదీకి లేఖరాశారు. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ అంశంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ వల్ల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తే.. ఏపీలో మాత్రం మొండిగా ముందుకెళ్తున్నారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహహణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ విషయంలో కలగజేసుకొని పరీక్షలు రద్దు చేసేలా చొరవ తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని లేదా రద్దు చేయాలని సీఎంఓకు ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. తన లేకలో ఐపీసీ సెక్షన్ 269ను కూడా రఘురామ కృష్ణంరాజు ప్రస్తావించారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏది ఏమైనా టెన్, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తోంది. మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ప్రభుత్వం చెప్తోంది. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగానే పరీక్షలు నిర్వహిస్తామని చెప్తోంది. టెన్త్ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్తుకే నష్టమని సీఎం జన జగన్ అన్నారు. ఎంతకష్టమైనా పరీక్షలు నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు మొదలుపెట్టింది. మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నామని స్పష్టం చేసింది. ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక్కో నోడల్ అధికారిని నియమించేలా చర్యలు తీసుకుటోంది. ఇప్పటికే పరీక్షలపై మంత్రి ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐతే రఘురామకృష్ణంరాజు పరీక్షల విషయాన్ని ఏకంగా ప్రధాని వద్దకు తీసుకెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.