YSRCP REBEL MP RAGHURAMA KRISHNAM RAJU MADE SENSATIONAL COMMENTS ON YCP LEADERS PLANNING TO KILL MP GORANTLA MADHAV FULL DETAILS HERE PRN BK
YSRCP: వైసీపీ ఎంపీ హత్యకు కుట్ర..? సొంతపార్టీ నేతలే స్కెచ్ వేశారా..? బాంబు పేల్చిన మరో ఎంపీ..!
ప్రతీకాత్మకచిత్రం
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghu Rama Krishnam Raju). ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ (YSRCP) తరపున ఎంపీగా గెలిచినా సొంత పార్టీ అధినేతతో పాటు ఆ పార్టీ నేతలను నిత్యం ఎండగుతుంటారాయన. తాజాగా ఆయన మరో బాంబు పేల్చారు.
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghu Rama Krishnam Raju). ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ (YSRCP) తరపున ఎంపీగా గెలిచినా సొంత పార్టీ అధినేతతో పాటు ఆ పార్టీ నేతలను నిత్యం ఎండగుతుంటారాయన. రఘురామ కృష్ణంరాజు వ్యవహారం సీఎం జగన్ (AP CM YS Jagan) కంట్లో నలుసుల మారినప్పటికీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. మరోవైపు ఎక్కడా తనను పార్టీ నుంచి డిస్మిస్ చెయ్యటానికి విల్లేకుండా సొంత పార్టీపై విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారాయన. అయితే ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం గా మారాయి. జైల్లో తనని చంపడానికి ప్రభుత్వం ప్లాన్ చేసిందని చెప్పటం తో పాటు మరో బాంబ్ కూడా పేల్చారు రఘురామ.
రఘురామ చేసిన సంచలన ఆరోపణ ఏంటంటే.. తన పార్టీలోని ఓ ఎంపీని చంపి.. ఆ కేసును తనపైకి నెట్టే ప్లాన్ జరుగుతోందన్నారు. ఆ ఎంపీ ఎవరో కాదు. అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. గోరంట్ల మాధవ్ ను హత్య చేయడానికి సొంతపార్టీ నేతలే ప్లాన్ చేశారని.. ఆ నేరాన్ని తనపై వేయడానికి పార్టీలో కొందరు కుట్రపన్నారని తన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు రఘురాం కృష్ణంరాజు. ఈ సమాచారాన్ని ముందుగానే తాను గ్రహించి ఎంపీ గోరంట్ల మాధవ్ ను హెచ్చరించానన్నారు.
గోరంట్ల మాధవ్ ను పార్టీ అధిష్టానమే రెచ్చగొట్టి తనపైన దురుసుగా మాట్లాడిస్తోందని.. ఆ తర్వాత ఆయన్ను హతమార్చి ఆ నేరాన్ని తన ఖాతాలో వేయడానికి పార్టీలోని కొందరు కీలక నేతలు ప్లాన్ చేస్తన్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఓ రోజు పార్లమెంట్ లాబీల్లో నడుచుకుంటూ వెళ్తున్నసమయంలో గోరంట్ల మాధవ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా తాను మాత్రం స్పందించకుండా వెళ్లిపోయినట్లు రఘురామ వివరించారు. ఎంపీ మాధవ్ తనను చాలా సార్లు పచ్చి బూతులు తిడుతూ రెచ్చగొట్టారని అప్పుటే పార్టీ నేతల స్కెచ్ తనకు అర్ధమైన సైలెంట్ గా ఉండిపోయారన్నారు. ఇటీవల తనను బూతులు తిట్టిన ఎంపీని సీఎం జగన్ అభినందించడం దారుణమన్నారాయన.
ఇన్నాళ్లూ సీఎం జగన్ పై, ప్రభుత్వ విధానాలు, పార్టీ వైఖరిపై విమర్శలు చేస్తున్న రఘురామ కృష్ణంరాజు.. ఇప్పుడు ఏకంగా హత్యారాజకీయాలను తెరపైకి తీసుకురావడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఐతే రఘురామ కామెంట్స్ ను వైసీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు. ఆయన చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారని.. ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమేనని పలువురు వైసీపీ నేతలంటున్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో రఘురామ.. సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.