Raghu Rama Krishnam Raju: రఘురామ కేసులో ట్విస్ట్.. సీఐడీ పోలీసులపై సంచలన ఆరోపణలు..

రఘురామ కృష్ణంరాజు(ఫైల్ ఫొటో)

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై (Raghu Rama Krishnam Raju) సీఐడీ కేసు (CID Case) నమోదు, అరెస్ట్ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది.

  • Share this:
    నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ కేసు నమోదు, అరెస్ట్ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ఆయన్ను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు గుంటూరులోని సీబీసీఐడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టులో కోర్టులో హైడ్రామా చోటుచేసుకుంది. కోర్టుకు హాజరైన సందర్భంగా సీఐడీ పోలీసులపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. సీఐడీ పోలీసులు తనను కొట్టారని లాయర్లకు తెలిపారు. రాత్రంతా వేధింపులకు గురిచేశారని జడ్జికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన కాళ్లపై గాయాలతో కూడిన ఫోటోలను కూడా ఆయన సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిప్పిపంపారు. రఘురామకృష్ణంరాజు తరపు లాయర్లు విడుదల చేసిన ఫోటోల్లో ఆయన పాదాలు, అరికాళ్లు ఎర్రగా కమిలిపోయి ఉన్నాయి. అవి నిజంగా పోలీసులు కొట్టినవా లేక ఇతర గాయాలా అనేది తేలాల్సి ఉంది. రఘురామ కృష్ణంరాజును వెంటనే ఆస్పత్రికి తరలించాలని కోర్టు సూచించింది. ప్రభుత్వాస్పత్రికి వెళ్లేందుకు ఆయన నిరాకరించడంతో రమేష్ ఆస్పత్రికి తరలించారు.

    ఇదిలా ఉంటే.. తమను కోర్టుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని రఘురామ కృష్ణంరాజు తరపు లాయర్లు తెలిపారు. పబ్లిక్ కోర్టులో వెళ్లేందుకు పోలీసులు అనుమతి తీసుకోవాలా అని లాయర్ లాయర్ గోపీనాథ్ ప్రశ్నించారు. రఘురామ కృష్ణంరాజు ఒంటిపై గాయాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

    YSRCP MP Raghurama Krishnam Raju, Raghurama Krishnam Raju, MP Raghu Rama Krishnam Raju Arrested, AP CID Arrested MP Raghurama krishnam Raju, AP CID, Andhra Pradesh politics, AP Politics, Andhra Politics, Andhra Pradesh, Andhra Pradesh News, AP News, Andhra News, Telugu news, Hyderabad News, వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్, రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ, ఏపీ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, Andhra Pradesh High Court, AP High Court, ఆంధ్రప్రదేశ్ హై కోర్టు, ఏపీ హైకోర్టు, సీఐడీ పోలీసులు, సీఐడీ కోర్టు, CID Court, CID police
    కాళ్లపై గాయాలైనట్లు చూపిస్తున్న రఘురామ కృష్ణంరాజు


    మరోవైపు రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాది ఆదినారాయణరావు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ప్రవీణ్‌ నేతృత్వంలో స్పెషల్‌ డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటైంది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించిన హైకోర్టు.. ‘‘కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొడతారు? రఘురామకు తగిలినవి తాజా గాయాలని తేలితే తీవ్ర పరిణామాలు’’ తప్పవని హెచ్చరించింది. ఎంపీ రఘురామ ఒంటిపై గాయాలను వెంటనే మెడికల్ బోర్డుతో పరిశీలిన చేయించాలని ఆదేశించింది.

    ఈ మొత్తం వ్యవహారంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేస్తామని రఘురామ కృష్ణంరాజు తరపు లాయర్లు తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని వారు కోరారు. ఇక ఇప్పటికే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో రఘురామ చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. బెయిల్ కోసం కింది కోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. ప్రభుత్వంపై విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ రఘురామ కృష్ణంరాజుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సీఐడీ.. శుక్రవారం ఆయన్ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
    Published by:Purna Chandra
    First published: