RaghuRamaKrishnam Raju: జగన్ గారూ ఆ పథకం పెట్టండి... కోర్టుకు వెళ్లే పని ఉండదు.. వైసీపీ ఎంపీ సెటైర్లు

సీఎం జగన్ కు ఎంపీ రఘురామ కృష్ణం రాజు చురకలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (Raghu Rama krishnam Raju) రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తనదైన స్టైల్లో కౌంటర్లు వేశారు. సీఎం జగన్ (YS Jaganmohanreddy) తో పాటు మంత్రులు, సలహాదారులకు చురకలంటించారు.

 • Share this:
  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తనదైన స్టైల్లో కౌంటర్లు వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఉద్యోగ సంఘాలను కూడా వదలకుండా వదలకుండా సతిమెత్తగా చురకలంటించారు. ప్రజల కోసం జీతం తీసుకోని గొప్ప ముఖ్యమంత్రి జగన్ అంటూనే...జీతం తీసుకోవడం మానేసిన ఆయన పని చేయడం కూడా మానేశారా అని ప్రశ్నించారు. పనికిమాలిన వాళ్లను సలహాదారులగా తీసుకున్న ముఖ్యమంత్రి.., పాలనంతా సలహాదారుల చేతుల్లో పెట్టేశారమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. తనకు ఇష్టమొచ్చిన వాళ్లను సలహాదారులగా పెట్టుకున్న సీఎం... లెక్కకు మించిన వ్యక్తులకు కేబినెట్ ర్యాంకులిచ్చారన్నారు. ఇంతమంది సలహాదారులకు జీతాలిస్తున్న సీఎం.. ఓ కోటి రూపాయలు జీతం తీసుకోవచ్చారు.

  ఎవరైనా కోర్టుకెళ్తే కష్టం...
  రాజ్యంగంలోని 164(1ఏ) అర్టికల్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వంలో 15శాతానికి మించి కేబినెట్ ర్యాంక్ ఇవ్వడానికి వీల్లేదని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. గతంలో తెలంగాణ కేసీఆర్ లెక్కకు మించి కేబినెట్ ర్యాంకులిస్తే రేవంత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేస్తే వాళ్లని తొలగించారన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న పని చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న రఘురామ కృష్ణంరాజు.., లెక్కకు మించి కేబినెట్ ర్యాంక్ ఇవ్వకుండా సలహాదారులను పెట్టుకోమని సూచించారు. ఆర్టికల్ 164-1ఏ ప్రకారం ఎవరైనా పిటిషన్ వేస్తే కోర్టుకు వెళ్లడం మీకు అవసరమా? అని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఎన్నికల కమిషనర్ పై విమర్శలు చేయడం సరికాదు. ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ వైసీపీ ఆఫీస్ కు వెళ్లడం తప్పు. పార్టీ పదవి ఇవ్వడం కూడా పెద్ద బూతు. ప్రభుత్వ సొమ్ముతింటూ పార్టీ పనిచేయడం నీతిబాహ్యమైన పని. ఆ మాత్రం డబ్బులు పార్టీ ఇవ్వలేదా..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  ఆ పథకం పెట్టండి
  ఇక రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరికి రాజ్యాంగంపై ట్రైనింగ్ ఇవ్వాల్సిన అసరమందని రఘురామ కృష్ణం రాజు సూచించారు. ‘జగనన్న విద్యాదీవెన పథకం’ మాదిరిగా... ‘జగనన్న రాజ్యాంగ దీవెన పథకం’ ప్రవశపెట్టాలని సూచించారు. ఈ పథకం కింద ప్రభుత్వ సలహాదారులకు, మంత్రులకు, పార్టీ నేతలకు ప్రతి రోజూ రాజ్యాంగాన్ని బోధించాల్సిన అవసరముందన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవారందిరికీ ఆ పథకం చాలా బాగా ఉపయోగపడుతుందన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగతంగా దూషించడం సరికాదని హితవు పలికారు.

  ఇది చదవండి: జనసేనాని రూటు మార్చాడా..? కాపులకు దగ్గరయ్యేందుకు ట్రై చేస్తున్నాడా..?


  వాళ్ల స్వతంత్రం లాగేసుకోండి
  ప్రతిసారి ప్రభుత్వం, వైసీపీ నేతలపై విమర్శలు చేసే రఘురామ కృష్ణం రాజు... ఈసారి కాస్త రూటు మార్చి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలకు చురకలంటించారు. పంచాయతీ ఎన్నికల విషయంలో హడావిడి చేసిన వారు ఇప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేస్తున్నారన్నారు. ప్రభుత్వం వారికి స్వేచ్ఛనివ్వడం వల్లే అలా జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వారి దగ్గర నుంచి స్వేచ్ఛను లాగేసుకోపోతే రేపు మీ మీదే అవాకులు... చవాకులు పేలే అవకాశముందని సున్నితంగా హెచ్చరించారు. ఎన్నికలను వ్యతిరేకించిన ఉద్యోగులు.., రేపు సినిమా హాళ్లకు వెళ్లరా అంటూ కాస్త వెటకారంగా ప్రశ్నించారు.
  Published by:Purna Chandra
  First published: