Raghurama on Jagan: జగన్ ను వదలని రఘురామ... సుప్రీం కోర్టులో మరో పిటిషన్...

ఎంపీ రఘరామ కృష్ణంరాజు, సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) పై వైఎస్ఆర్సీపీ (YSRCP) రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghu Rama Krishnam Raju) మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) పై వైఎస్ఆర్సీపీ (YSRCP) రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghu Rama Krishnam Raju) మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన ఎదురుదెబ్బతిన్న సంగతి తెలిసిందే..! ఐతే పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తున్న రఘురామకృష్ణం రాజు... తాజాగా సుప్రీం కోర్టులో మరో పిటిషన్ వేశారు. సీఎం జగన్ పై కేసుల విచారణపై పిటిషన్ వేసినట్లు రఘురామ తెలిపారు. సీఎంపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని పిటిషన్న రఘురామ.. క్రిమినల్ కేసులను ఏడాదిలోగా విచారించాలని గతంలో సుప్రీం ఆదేశాలిచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. మా ముఖ్యమంత్రి నిర్దోషిగా బయటకు రావాలని ఆయన అన్నారు.

  ఇటీవల ఓ కేసులో ఏడేళ్ల పాటు విచారణ జరిపితే సుప్రీం తప్పుబట్టిందని.. కావున జగన్ పై ఉన్న కేసులను వేగంగా విచారణ జరిపితే ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న నమ్మకంతో పిటిషన్ వేసినట్లు తెలిపారు. తమ అధినేత ఎలాంటి తప్పు చేయలేదని త్వరగా ఋజువు కావాలనేదే తన ప్రయత్నమన్నారు. జగన్ పై దాఖలైన ఛార్జి షీట్లపై విచారణ 2200 సార్లకు పైగా వాయిదా పడినట్లు రఘురామ వెల్లడించారు.

  ఇది చదవండి: టీడీపీ నేత పట్టాభికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..


  గతంలో జగన్ బెయిలు రద్దు చేయాలని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో రఘురామ పిటిషన్ వేయగా కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును ఆయన తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయగా సాంకేతిక కారణాలతో వెనక్కి పంపింది. ఐతే ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించేలా సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

  ఇది చదవండి: టీడీపీ ఢిల్లీ టూర్.. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఫిక్స్.. మోడీ, షా టైమ్ ఇస్తారా..?  కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న రఘురామ కృష్ణంరాజు... రచ్చబండ పేరుతో ప్రభుత్వపై మండిపడుతున్నారు. ఇసుక, మద్యం, ప్రతిపక్ష నేతలపై కేసులు, దాడులు, మంత్రుల భాష, మూడు రాజధానులు.. ఇలా పలు అంశాలపై వ్యాఖ్యలు చేస్తున్నారాయన. మరోవైపు తమ పార్టీ గుర్తుపై గెలిచి తమ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న రఘురామ కృష్ణం రాజును అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే పార్లమెంటులో అవకాశం వచ్చినప్పుడల్లా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు.

  ఇది చదవండి: అలా చేస్తే బీజేపీలో టీడీపీ విలీనం… చంద్రబాబు ప్రతిపాదన.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు..  ఇదిలా ఉంటే గతంలో తన పుట్టిన రోజు వేడుకలకు హైదరాబాద్ వచ్చిన రఘురామ కృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు ఇంటికెళ్లి మరీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన.. పోలీసులు తనను కొట్టారంటూ జడ్జికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వ్యవహారం ఆర్మీ ఆస్పత్రి వరకు వెళ్లడం రఘురామకు బెయిల్ రావడం జరిగాయి.
  Published by:Purna Chandra
  First published: