ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) బెయిల్ రద్దు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ (YSRCP) రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghu Rama Krishnam Raju) దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court) కొట్టివేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) బెయిల్ రద్దు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. జగన్ బెయిల్ రద్దు (YS Jagan Bail Cancellation) చేయాలంటూ వైఎస్ఆర్సీపీ (YSRCP) రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghu Rama Krishnam Raju) దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Court) కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఐతే పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తున్న రఘురామకృష్ణం రాజు... సీబీఐ కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) సవాల్ చేశారు. జగన్ పై ఉన్న 11 ఛార్జ్ షీట్లు పై సమగ్రమైన దర్యాప్తు చేయాలని, ఆయన బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరితగతిన జరిగేలా ఆదేశాలివ్వాలని కోరారు. రఘురామ పిటిషన్ పై హైకోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. అక్రమాస్తుల కేసులో బెయిల్ పై విడుదలైన జగన్ సీఎందవిలో ఉన్నందున ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని.. అందువల్ల ఇద్దరి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు ఈ ఏడాది ఆరంభంలో నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ కూడా దాఖలు చేసింది.
రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై దాదాపు ఆరు నెలల పాటు విచారణ జరిపిన సీబీఐ కోర్టు సెప్టెంబర్ 15న తీర్పువెలువరించింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్, విజయసాయి రెడ్డికి ఊరటనిస్తూ రఘురామ పిటిషన్ కొట్టేసింది. బెయిల్ జగన్, విజయసాయి బెయిల్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారన్న సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించిన న్యాయస్థానం జగన్ కు గుడ్ న్యూస్ చెప్పింది.
ఐతే ఇదే రోజు బెయిల్ రద్దు పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ ను తెలంగాణ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. సరైన కారణం లేకుండా బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేసింది. ఐతే ఇప్పుడు సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రఘురామ హైకోర్టు మెట్లెక్కారు. ఇక్కడ ఎలాంటి విచారణ జరగబోతోంది..? తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న రఘురామ కృష్ణంరాజు... రచ్చబండ పేరుతో ప్రభుత్వపై మండిపడుతున్నారు. ఇసుక, మద్యం, ప్రతిపక్ష నేతలపై కేసులు, దాడులు, మంత్రుల భాష, మూడు రాజధానులు.. ఇలా పలు అంశాలపై వ్యాఖ్యలు చేస్తున్నారాయన. మరోవైపు తమ పార్టీ గుర్తుపై గెలిచి తమ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న రఘురామ కృష్ణం రాజును అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే పార్లమెంటులో అవకాశం వచ్చినప్పుడల్లా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు.
ఇదిలా ఉంటే గతంలో తన పుట్టిన రోజు వేడుకలకు హైదరాబాద్ వచ్చిన రఘురామ కృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు ఇంటికెళ్లి మరీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన.. పోలీసులు తనను కొట్టారంటూ జడ్జికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వ్యవహారం ఆర్మీ ఆస్పత్రి వరకు వెళ్లడం రఘురామకు బెయిల్ రావడం జరిగాయి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.