YSRCP REBAL MP RAGHURAMA KRISHNAM RAJU SLAMS CM JAGAN AND YSRCP LEADERS OVER DEBTS AND POLICE CASES AGAINST HIM HERE ARE THE DETAILS PRN
Raghurama Krishnam Raju: ముందు వాటిపై దృష్టి పెట్టండి.. జగన్ కు రఘురామకృష్ణంరాజు సలహా
సీఎం జగన్ కు ఎంపీ రఘురామ కృష్ణం రాజు చురకలు
వైఎస్ఆర్సీపీ (YSRCP) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Ragu Rama Krishnam Raju) మరోసారి సొంత ప్రభుత్వంపై మండిపడ్డారు. అప్పుల నుంచి పోర్టులు, తనపై కేసుల వరకు అన్ని విషయాల్లో జగన్ ను ప్రభుత్వాన్ని విమర్శించారు.
వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సొంత ప్రభుత్వంపై మండిపడ్డారు. అప్పుల నుంచి పోర్టులు, తనపై కేసుల వరకు అన్ని విషయాల్లో జగన్ ను ప్రభుత్వాన్ని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారన్న రఘురామ కృష్ణం రాజు 10 నెలల్లో రూ.73వేల 912 కోట్ల అప్పులు చేశారన్నారు. ఈ స్థాయిలో అప్పులు దేశంలో ఏ రాష్ట్రమూ చేయడం లేదన్నారు. అసలు మన రాష్ట్రం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాలు అప్పులు చేయడం లేదని చెప్పారు. దీనికి అదనంగా రిజర్వ్ బ్యాంక్ నుంచి చేబదుళ్లు కూడా తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలపై ఎన్నడూ లేనంత భారం పడుతోందన్నారు.
కొత్త పోర్టులు అనవసరం
రాష్ట్రంలో కొత్త పోర్టుల ఏర్పాటు అనవసరమని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. కాకినాడ, రామాయంపట్నంలో నిర్మించతలపెట్టిన పోర్టులతో రాష్ట్రానికి ఒరిగేదేం లేదన్న ఆయన.. ఇప్పటికే ఉన్న పోర్టుల్లో ఏ మాత్రం గ్రోత్ రేట్ నమోదు కావడం లేదన్నారు. మూడేళ్లుగా విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు ఆర్ధికంగా ఏమీ అభివృద్ధి చెందడం లేదని.. అప్పులు తీసుకొచ్చి పోర్టులకు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. అప్పులు చేసి పోర్టులు కట్టేబదులు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం మేలని సలహా ఇచ్చారు.
వాటికి నిధులెక్కడ..?
రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేయాలని సీఎం సరైన నిర్ణయం తీసుకున్నారన్న రఘురామ కృష్ణంరాజు.. మెడికల్ కార్పొరేషన్ ఎందుకని ప్రశ్నించారు. వాటికి నిధులెక్కడి నుంచి తెస్తారన్నారు. కొత్త అప్పులకు ప్రభుత్వం దగ్గర ప్రత్యామ్నాయ మార్గాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పోరాడాలని సూచించారు.
ఇక తనపై పెడుతున్న కేసుల విషయంలోనూ ఆయన ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. సీఎం సొంత బాబాయి వివేకానంద రెడ్డిని చంపేస్తే పట్టించుకోని ప్రభుత్వం తనపై మాత్రం చాలా వేగంగా కేసులు పెడుతోందని విమర్శించారు. తాను ఏపీకి రావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానన్న ఆయన.. ఆ మరుసటి రోజే వైసీపీ నేతలు తనపై కేసులు పెట్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడుల గురించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా వద్ద ప్రస్తావిస్తే.. దాని ఆదారంగా తనపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేయించారన్నారు. ఈ కేసుల వెనుక తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలున్నాయని.. ఇందులో డీజీపీ హస్తం కూడా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. తనపై పెట్టిన కేసుల విషయాన్ని లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.