Andhra Pradesh: తిరుపతి ఉపఎన్నికపై ఫోకస్.. వైసీపీ వ్యూహం అదేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andha Pradesh) తిరుపతి ఉప ఎన్నికపై (Tirupathi By-poll) వైఎస్ఆర్సీపీ (YSRCP)ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకే చిత్తూరు జిల్లాలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేతుల మీదుగాఇళ్లపంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎలక్షన్ హడావిడి రానుంది. త్వరలో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నందున రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇక్కడ గెలిచి తమ ఆధిక్యాన్ని నిలుప్పుకోవాలని అధికార వైసీపీ, ప్రభుత్వ వ్యతిరేకతను నిరూపించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, సత్తా చాటుకోవాలని జనసేన-బీజేపీ ఎదురుచూస్తున్నాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అన్ని పార్టీలు ఇప్పటికే పోటీపై క్లారిటీకి వచ్చాయి.వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టేశాయి. టీడీపీ ఇప్పటికే పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించగా.. వైఎస్సార్సీపీ డాక్టర్‌ గురుమూర్తిని బరిలోకి దింపుతుందనే ప్రచారం జరుగుతోంది. కాగా జనసేన- బీజేపీ అభ్యర్థి ఎంపికపై ఇంతవరకు క్లారిటీ రాలేదు.

  వైసీపీ స్పెషల్ ఫోకస్
  గతంలో సిట్టింగ్ ఎంపీనో, ఎమ్మెల్యేనో మృతి చెందితే ఉపఎన్నికల్లో ఇతర పార్టీలు పోటీకి నిలిచేవి కావు. కానీ నేటి రాజకీయాలు మారిపోయాయి. చనిపోయినా, రాజీనామా చేసినా పోటీ మాత్రం అసలు ఎన్నికలను తలపిస్తుంది. అందుకే ఎవరికి వారు ఎలక్షన్ ప్లాన్స్ తో సిద్ధంగా ఉంటున్నారు. ఈ ఉప ఎన్నికపై అధికార వైసీపీ ఫోకస్ పెట్టింది. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. ఇటీవలే ఆ పార్టీ ముఖ్యనేతలు సమావేశమై తిరుపతి వ్యూహంపై చర్చించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా ముందుగానే ప్రణాళికలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఎంపీలు ఎమ్మెల్యేలందరూ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని మంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది.

  ఉపఎన్నిక కోసమేనా..?
  ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోనే సీఎం జగన్‌ ద్వారా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 25న ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించరు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత డిసెంబర్‌ 27వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని తిరుపతిలోనే ఏర్పాటు చేసి పార్టీ కేడర్ ను సన్నద్ధం చేయాలని డిసైడ్ చేశారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు, మండలాల బాధ్యతలను ప్రాంతాలవారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు అప్పగించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.

  ఇక తిరుపతి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని దాదాపు ఖరారు చేసిన సీఎం వైఎస్ జగన్.., దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో దుర్గాప్రసాద్ కుటుంబాన్ని సీఎం మోసం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అంతేకాదు మండలి రద్దుకు సిఫార్సు చేసి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇలా ఇస్తారని ప్రశ్నించాయి.
  Published by:Purna Chandra
  First published: