పవన్ కళ్యాణ్ గోడమీద పిల్లి.. వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

‘పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారు. చంద్రబాబుకి రహస్య మిత్రుడిలా మాట్లాడుతున్నారు. గోడమీద పిల్లి వాటాన్ని పవన్ కళ్యాణ్ మానుకోవాలి.’

news18-telugu
Updated: September 14, 2019, 5:39 PM IST
పవన్ కళ్యాణ్ గోడమీద పిల్లి.. వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
జగన్ వంద రోజుల పాలనపై బుక్‌లెట్ విడుదల చేసిన జనసేన
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురుదాడి మొదలు పెట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పాలన మీద పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోశారు. జగన్ నవరత్నాలు జనరంజకంగా ఉన్నాయి కానీ, ఆయన పాలన మాత్రం జనవిరుద్ధంగా ఉందంటూ విరుచుకుపడ్డారు. దీంతోపాటు జగన్ పాలన మీద ఓ బుక్‌లెట్ కూడా రిలీజ్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ మీద వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. మీడియాతో మాట్లాడిన వైసీపీ పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారు. చంద్రబాబుకి రహస్య మిత్రుడిలా మాట్లాడుతున్నారు. గోడమీద పిల్లి వాటాన్ని పవన్ కళ్యాణ్ మానుకోవాలి. జగన్ 100 రోజుల్లో 19 చారిత్రాత్మకమైన బిల్లులు తెచ్చారు. వాటిపై జనసేనాని అధ్యయనం చేయాలి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇవేవీ పవన్ కళ్యాణ్‌కు కనపడలేదా?’ అని కిలారి రోశయ్య ప్రశ్నించారు.

చంద్రబాబు ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుంటే, కనీసం అప్పుడు నోరెత్తని పవన్ కళ్యాణ్ ఇప్పుడు... జగన్ వంద రోజుల పాలన మీద విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పవన్ కళ్యాణ్.. చంద్రబాబు తొత్తులా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అమర్ నాథ్ కూడా పవన్ కళ్యాణ్ మీద ఎదురుదాడి చేశారు. గెలిచినా, ఓడినా ఏడాదిలో 100 రోజులు గాజువాకలోనే ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత కనీసం 100 సెకన్లు కూడా తాను పోటీ చేసిన నియోజకవర్గానికి కేటాయించలేదని అమర్ నాథ్ విమర్శించారు.
First published: September 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading