లోకేశ్‌కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ మామ… వైసీపీ ప్లాన్ ?

మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ చేయడం ఖాయం కావడంతో... వైసీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సీటను మరోసారి ఎమ్మెల్యే ఆర్కేకు కేటాయించాలని వైసీపీ నిర్ణయించినా... తాజా పరిణామాల నేపథ్యంలో జూనియర్ మామ నార్నే శ్రీనివాసరావును బరిలో దింపే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: March 14, 2019, 9:14 AM IST
లోకేశ్‌కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ మామ… వైసీపీ ప్లాన్ ?
నారా లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పోటీపై స్పష్టత వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ ఏపీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేశ్‌ను గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. మొదటి లోకేశ్‌ను విశాఖ జిల్లా భీమిలి లేదా విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి బరిలో నిలపాలని భావించినా... చివరకు మంగళగిరి సీటును కుమారుడికి ఖరారు చేశారు చంద్రబాబు. రాజధాని అమరావతి ప్రాంతం కావడంతో... లోకేశ్ పోటీ కారణంగా ఇక్కడ టీడీపీకి సానుకూలతలు ఉంటాయని చంద్రబాబు అంచనా వేసినట్టు సమాచారం.

మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై కేవలం 12 ఓట్ల తేడాతో విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఓడించాలంటే లోకేశ్ వంటి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని టీడీపీ భావించినట్టు తెలుస్తోంది. అయితే మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ చేయడం ఖాయం కావడంతో... వైసీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సీటను మరోసారి ఎమ్మెల్యే ఆర్కేకు కేటాయించాలని వైసీపీ నిర్ణయించినా... తాజా పరిణామాల నేపథ్యంలో జూనియర్ మామ నార్నే శ్రీనివాసరావును బరిలో దింపే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నిజానికి ఈ సీటును టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఉడతా శ్రీనుకు కేటాయించాలని జగన్ భావించారు. అయితే ఇందుకు ఆర్కే ఒప్పుకోకపోవడంతో... మరోసారి ఆయనకే సీటు కేటాయించినట్టు ప్రచారం జరిగింది. అయితే లోకేశ్ బరిలో ఉండటంతో... వైసీపీ కూడా వ్యూహం మార్చిందని తెలుస్తోంది. లోకేశ్‌ను ఎదుర్కోవాలంటే ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన అభ్యర్థి ఉండాలని భావిస్తున్న వైసీపీ... ఇటీవల పార్టీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావును ఇక్కడి నుంచి పోటీ చేయించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

పార్టీలో చేరే సమయంలో ఆయనకు కచ్చితంగా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారని... ఈ మేరకు మంగళగిరి సీటు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై వైసీపీ ముఖ్యనేతలు యోచిస్తున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. గుంటూరూ పరిధిలో నియోజకవర్గంలో పోటీ చేసేందుకు నార్నే శ్రీనివాసరావు కూడా సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. మొత్తానికి లోకేశ్‌కు పోటీ జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు పోటీలో ఉంటే... మంగళగిరి పోటీ రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>