జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, ఏపీలోని అధికార వైసీపీకి మధ్య వార్ రోజురోజుకు ముదురుతోంది. వైసీపీని టీడీపీ కంటే ఎక్కువగా టార్గెట్ చేస్తూ పొలిటికల్ మైలేజీ పొందడంతో పాటు ఆ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. వైసీపీని ఎంత గట్టిగా టార్గెట్ చేస్తే.. అంత ఎక్కువగా ఏపీ రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీపై మాటల దాడిని రోజురోజుకు పెంచుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీకి కూడా వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను దెబ్బకొట్టాలని భావిస్తున్న వైసీపీ.. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌కు మద్దుతగా నిలిచే కాపు సామాజికవర్గాన్ని మాత్రం దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేదు.
అందుకే కాపు సామాజికవర్గానికి వైసీపీ వ్యతిరేకం కాదనే సంకేతాలను పంపిస్తూనే రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను దెబ్బకొట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సోదరుడు, టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవికి ఏపీ ప్రభుత్వం, వైసీపీ గౌరవం ఇస్తుందనే సంకేతాలు ఇవ్వడం ఈ వ్యూహంలో భాగమే అనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్, చిరంజీవి మధ్య సత్సంబంధాలు బలపడ్డాయి.
పలు సందర్భాల్లో చిరంజీవి వెళ్లి సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. సీఎం జగన్ కూడా చిరంజీవి పట్ల సానుకూలంగానే ఉంటూ వచ్చారు. దీనికితోడు ఏపీ కేబినెట్లో ఉన్న మంత్రి కన్నబాబు చిరంజీవికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే వైసీపీ రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తున్నప్పటికీ.. చిరంజీవి విషయంలో సానుకూల వైఖరితోనే ఉంటూ వస్తోంది.
Telangana Congress: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ?.. స్పందించిన సీనియర్ నేత.. ఆ తరువాతే ప్రకటన
Remove Spiders From Home: ఇంట్లో సాలీడు సమస్య ఉందా ? ఇలా చేయండి.. వెంటనే బయటకు వెళ్లిపోతాయి..
తాజాగా పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేసినట్టు ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ రకంగా చిరంజీవికి వైసీపీ, ఏపీ ప్రభుత్వం గౌరవం ఇస్తుందని... తమ రాజకీయ వైరం కేవలం పవన్ కళ్యాణ్‌తో మాత్రమే అనే సంకేతాలను కాపు సామాజికవర్గానికి పంపుతోంది. మరోవైపు చిరంజీవితో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా మెగా ఫ్యామిలీ మొత్తం రాజకీయంగా పవన్ కళ్యాణ్ వెంట వెళ్లకుండా చేయాలనే యోచనలో వైసీపీ ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chiranjeevi, Janasena, Pawan kalyan, Ysrcp