వైసీపీ ఎమ్మెల్యే తిట్ల దండకం... లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసిందే కాకుండా...

ఎమ్మెల్యే వెంకటయ్యగౌడ్ లాక్‌డౌన్ నిబంధనలను తోసిరాజని, తన అనుచరులైన 50 మందితో కలసి ఓ వంతెన ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

news18-telugu
Updated: April 3, 2020, 11:12 PM IST
వైసీపీ ఎమ్మెల్యే తిట్ల దండకం... లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసిందే కాకుండా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, ఆ విషయాన్ని టీవీల్లో ప్రసారం చేశారన్న కోపంతో మీడియా మీద తిట్ల దండకం అందుకున్నారు చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్యగౌడ్ లాక్‌డౌన్ నిబంధనలను తోసిరాజని, తన అనుచరులైన 50 మందితో కలసి ఓ వంతెన ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు అధికార వైసీపీ ప్రభుత్వం చెబుతున్న సోషల్ డిస్టెన్స్ మాటే లేకుండా అందరూ పక్క పక్కన, వెనుక వెనుక నడుచుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎమ్మెల్యే వంతెన రిబ్బన్ కట్ చేస్తున్న సమయంలో అందరూ పక్కపక్కనే ఆనుకుని నిలబడ్డారు. అంతా చప్పట్లు కొట్టారు. అందులోకొందరు ఒకరికొకరు తోసుకుంటూ వీడియోలో కనపడేందుకు ప్రయత్నం చేసిన దృశ్యాలు కూడా ఉన్నాయి. వారిలో మెజారిటీ మెంబర్స్ ఎవరూ కూడా కనీసం మాస్క్‌లు కూడా ధరించలేదు. ఈ వార్త పలు మీడియా ఛానళ్లలో ప్రసారం అయింది. దీంతో ఎమ్మెల్యేకు కోపం వచ్చింది. మీడియా మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. తిట్ల దండకం అందుకున్నారు.

First published: April 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading