రోజా పెదాలపై నవ్వు... అలక వీడినట్టేనా?

చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టేనా?

news18-telugu
Updated: May 27, 2020, 5:00 PM IST
రోజా పెదాలపై నవ్వు... అలక వీడినట్టేనా?
రోజా (Roja )
  • Share this:
చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి మధ్య వివాదం సద్దుమణిగినట్టేనా? సినిమాల్లో చూపినట్టు పొలిటికల్ కథ సుఖాంతం అయినట్టేనా?. తాజాగా జరిగిన ఘటనను చూస్తుంటే వివాదానికి శుభం కార్డు పడినట్టే అని భావిస్తున్నారు. రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజవకర్గంలో ఆమెను పిలవకుండానే మంత్రి నారాయణస్వామి, మరో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ పలు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం దుమారానికి దారి తీసింది. నగరిలో రోజాను వ్యతిరేకిస్తున్న కేజే కుమార్ వర్గం ఈ కార్యక్రమానికి హాజరైంది. నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తనన పిలవకుండా తన ప్రత్యర్థి వర్గానికి పెద్దపీట వేయడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. డిప్యూటీ సీఎం మీద విమర్శలు కూడా గుప్పించారు. అయితే, ఆయన కూడా అందుకు దీటుగానే బదులిచ్చారు. ఈ వ్యవహారంపై వైసీపీ పెద్దలు కూడా జోక్యం చేసుకున్నారు. తాజాగా, ఎమ్మెల్యే రోజాను పుత్తూరు అంబేద్కర్ ట్రస్టు సభ్యులు కలిశారు. కల్యాణమండపం నిర్మాణానికి సహకరించాలని కోరుతూ ఆమెకు వినతిపత్రాన్ని అందించారు. అంతేకాదు, తమకు కూడా ఇళ్ల స్థలాలను ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా వారితో రోజా మాట్లాడుతూ, ఏం తప్పు చేశానని తనను పిలవలేదని ప్రశ్నించారు. ఎస్సీలకు కల్యాణమండపం కడితే తనకు కూడా సంతోషమేనని చెప్పారు. తనను కూడా పిలిచి ఉంటే గౌరవంగా ఉండేదన్నారు. దీంతో, పరిస్థితి మారినట్టేనని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

First published: May 27, 2020, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading