టీడీపీకి భారీగా విరాళం ఇచ్చిన వైసీపీ ఎంపీలు

టీడీపీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 26.17 కోట్లు విరాళాల రూపంలో అందాయని పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చింది.

news18-telugu
Updated: August 18, 2019, 12:04 PM IST
టీడీపీకి భారీగా విరాళం ఇచ్చిన వైసీపీ ఎంపీలు
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
టీడీపీకి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ ఎంపీలు టీడీపీకి విరాళం ఇవ్వడం ఏమిటి అనుకుంటున్నారా ? ఇది నిజమే. అయితే అప్పట్లో టీడీపీకి భారీగా విరాళం ఇచ్చిన ఆ నేతలు... ఆ తరువాత పార్టీ మారారు. ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న ఆ నేతలు... అప్పట్లో పార్టీకి భారీగా విరాళం ఇచ్చారు. అయితే అనూహ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి మారిన ఆ నేతలు... వైసీపీ తరపున లోక్ సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం వైసీపీ ఎంపీలుగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి రూ.25 లక్షలు, రఘురామకృష్ణంరాజు రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చారు.

టీడీపీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 26.17 కోట్లు విరాళాల రూపంలో అందాయని పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చింది. ఇందులో అత్యధికంగా రూ.25 కోట్లు ఫ్రూడెంట్‌ ఎన్నికల ట్రస్టు నుంచి వచ్చినట్టు వివరించింది. రఘురామకృష్ణంరాజు, మాగుంటతో పాటు టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్‌ రావు, బూర్గుపల్లి శేషారావు, వేగేశ్న నరేంద్రవర్మ రాజు, దేవినేని అవినాశ్‌, యామినీబాల, అశోక్‌ గజపతిరాజుతో పాటు ప్రస్తుతం వైసీపీలో ఉన్న కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక సైతం టీడీపీకి విరాళం ఇచ్చిన వారి జాబితాలో ఉన్నారు.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>