జగన్‌కు కొత్త తలనొప్పి... వైసీపీలో ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీలు ?

ఢిల్లీలో విజయసాయిరెడ్డితో సమావేశమైన కొందరు ఎంపీలు... ఎమ్మెల్యేల తీరుపై ఆయనకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 19, 2019, 6:10 PM IST
జగన్‌కు కొత్త తలనొప్పి... వైసీపీలో ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీలు ?
సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
వైసీపీలో కొత్త పంచాయతీ మొదలైందా ? పార్టీ ఎమ్మెల్యేలపై ఎంపీలు అసంతృప్తితో ఉన్నారా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డితో సమావేశమైన ఎంపీలు... ఎమ్మెల్యేలపై తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ సమావేశం హాట్ హాట్‌గా సాగింది. రాష్ట్రంలో ఎమ్మెల్యేలతో సమానంగా తమకు కూడా అధికారాలు ఇవ్వాలని ఎంపీలు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలకే సీఎం జగన్ ప్రాధాన్యమిస్తున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. ఏ పని చేయాలన్న ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవాల్సి వస్తోందంటూ పలువురు ఎంపీలు చెప్పినట్టు తెలుస్తోంది.

పలు నియోజకవర్గాల్లో పనులు చేయకుండా ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని కొందరు ఎంపీలు ఆరోపించారు. ఎమ్మెల్యేలు మమ్మల్ని పట్టించుకోవడం లేదని కొందరు ఎంపీలు చెప్పగా... ఎమ్మెల్యేలకు ఇచ్చినంత ప్రోటోకాల్ మాకు ఎందుకు ఇవ్వరని మరికొందరు ఎంపీలు చెప్పినట్టు సమాచారం. నామినేటేడ్ పదవుల్లోనూ ఎంపీలకు ప్రాధాన్యమివ్వాలని వారు కోరినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో మాత్రమే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తే...తాము ఉండటంలో అర్థం లేదని కొందరు ఎంపీలు అన్నట్టు సమాచారం. అయితే ఈ విషయాలన్నింటినీ విన్న విజయసాయిరెడ్డి... అన్ని అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని వారిని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.


First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...