ఏపీలో వైసీపీ గెలిస్తే... ఆ ఎంపీకి మంత్రి పదవి గ్యారంటీ ?

వైసీపీ నేతలు గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారు. దీంతో ఆ పార్టీ నేతల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. జగన్ మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం కల్పిస్తారన్న అంశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

news18-telugu
Updated: May 21, 2019, 10:24 AM IST
ఏపీలో వైసీపీ గెలిస్తే... ఆ ఎంపీకి మంత్రి పదవి గ్యారంటీ ?
జగన్ మోహన్ రెడ్డి (File)
  • Share this:
ఎగ్జిట్ పోల్స్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈసారి ఏపీలో ప్రభుత్వ మార్పు ఖాయమని జాతీయ మీడియా సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా ప్రకటించాయి. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తేల్చాయి. దీంతో ఆ పార్టీ నేతలు గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారు. దీంతో ఆ పార్టీ నేతల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. జగన్ మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం కల్పిస్తారన్న అంశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కీలకమైన శాఖలు ఎవరికి దక్కనున్నాయన్న విషయంలో ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ పోతున్నారు. వైసీపీ తరఫున ఢిల్లీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న విజయసాయిరెడ్డికి ఆర్థిక శాఖ దక్కుతుందని చర్చించుకుంటున్నారు. అయితే సాయిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా మాత్రమే ఉన్నారు. అయితే ఆయనను ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా తీసుకోవాలన్న ప్రయత్నాల్లో యువనేత ఉన్నట్లు సమాచారం. పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన విజయసాయిరెడ్డికి ఆర్థిక శాఖ ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం.

చంద్రబాబునాయుడి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారన్న సంగతి తెలిసిందే. ఆయన తనయుడు నారా లోకేష్‌ను కూడా ఎమ్మెల్సీ కోటాలోనే మంత్రి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు విజయసాయిని కూడా ఎమ్మెల్సీని చేసి ఆర్థిక శాఖను అప్పగిస్తారని వైసీపీలో పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక ఎంతో కీలకమైన స్పీకర్ పదవిని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఇస్తారని, ఒకవేళ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, ఎమ్మెల్సీని చేసి ఆ పదవిని అప్పగించాలన్న యోచనలో జగన్ ఉన్నారని కూడా చర్చ జరుగుతోంది. స్పీకర్ పదవికి అంబటి రాంబాబు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. స్పీకర్ గా వీరిద్దరిలో ఎవరున్నా టీడీపీని సమర్ధవంతంగా హ్యాండిల్ చేయవచ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వీరితో పాటు మొదట్నుంచి తన వెంటే ఎన్న కొంతమంది నాయకులకు కూడా తన కేబినెట్‌లో జగన్ చేర్చుకోబోతున్నారని తెలుస్తోంది. ధర్మాన కృష్ణదాస్, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్కే రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, తదితరులకు పదవులు దక్కవచ్చని వైసీపీ నేతలు అంటున్నారు.

First published: May 21, 2019, 10:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading