గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూకు వెళ్లిరా.. నారా లోకేష్‌పై విజయసాయిరెడ్డి సెటైర్

40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. ఈ 40 ఏళ్ళలో కుటుంబ ఆస్తులను లక్ష రెట్లు పెంచుకున్నారని విమర్శించారు.

news18-telugu
Updated: July 14, 2019, 11:10 AM IST
గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూకు వెళ్లిరా.. నారా లోకేష్‌పై విజయసాయిరెడ్డి సెటైర్
విజయసాయిరెడ్డి, నారా లోకేష్
news18-telugu
Updated: July 14, 2019, 11:10 AM IST
మరోసారి ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి  చంద్రబాబు తనయుడు, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌పై మండిపడ్డారు.  ప్రజలు అధికారం నుంచి తరిమేశారో అర్థం కావడం లేదంటూ మీ నాన్నారూ, మీరూ ఆడే డ్రామాలు ఇక చాలంటూ లోకేష్‌కు చురకలంటించారు. దోచుకోవడం, దాచుకోవడాన్ని వ్యవస్థీకృతం చేసిన చరిత్ర మీదంటూ మండిపడ్డారు విజయసాయిరెడ్డి.  గ్రామ వలంటీర్ల ఇంటర్వ్యూలపై అభాండాలు వేస్తున్నావు... కావాలంటే దరఖాస్తు పెట్టుకుని ఇంటర్వ్యూకు వెళ్లిరా....అంటూ నారా లోకేష్‌కు సలహా ఇచ్చారు విజయసాయి.

చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగడం ప్రత్యేక అర్హతేమీ కాదు చంద్రబాబు గారూ అంటూ ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు.  ఈ 40 ఏళ్ళలో కుటుంబ ఆస్తులను లక్ష రెట్లు పెంచుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని రాబందులా పీక్కుతిన్నారని ఆరోపించారు. భావితరాలకు మీ చరిత్ర మీరు అలానే గుర్తుండిపోతుందని చంద్రబాబును ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగడం ప్రత్యేక అర్హతేమీ కాదు చంద్రబాబు గారూ. 40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే మీరు ప్రజల కోసం చేసిందేమీ లేదు. ఈ 40 ఏళ్ళలో కుటుంబ ఆస్తులను లక్ష రెట్లు పెంచుకున్నారు. రాష్ట్రాన్ని రాబందులా పీక్కుతిన్నారు. భావితరాలకు మీ చరిత్ర మీరు అలానే గుర్తుండిపోతుంది.Loading...
First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...