• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YSRCP MP VIJAYASAI REDDY TWEET ON REUTERS REPORTING ON KIA SB

కియా వెళ్లిపోతుందని రాయిటర్ కథనం... స్పందించిన విజయసాయిరెడ్డి

కియా వెళ్లిపోతుందని రాయిటర్ కథనం... స్పందించిన విజయసాయిరెడ్డి

KIA Motors : కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతోందా?

రెండు రోజుల క్రితం ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోతుందంటూ రాయిటర్స్ ప్రకటన చేసింది. ఏపీలో ఉన్న తన 1.1 బిలియన్ డాలర్ల విలువైన ప్లాంట్‌ను పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రానికి మార్చేందుకు కియా చర్చలు జరుపుతున్నట్లు రాయిటర్స్ సంచలన కథనం రాసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్క సంస్థ తరలి వెళ్లిపోతుంది. తాజాగా ఏపీలో కియా మోటర్స్ కూడా పక్క రాష్ట్రానికి వెళ్లిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మన లోకల్ వార్తా ఛానల్స్, మీడియా అనేక కథనాలు కూడా ప్రచురింరాయి. అయితే అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్‌ కూడా ఏకంగా దీనిపై ఓ కథనం రాసింది.  దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు 3 రాజధానుల వ్యవహారం కొనసాగుతుండగానే మరో వైపు కియా మోటార్స్ తరలింపు అంశం కలకలం రేపింది.రాయిటర్స్ ప్రకనటతో ఏపీలో అధికార, విపక్షాల మధ్య రచ్చ కొనసాగింది. కియా మోటర్స్ తరలింపుపై అసత్య ప్రచారంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో కియా మోటార్స్ తరలింపుపై తమ కథనాన్ని రాయిటర్స్ తొలిగించింది. తమ అవాస్తవ కథనాన్ని తొలగిస్తున్నామని ట్విట్టర్ ద్వారా రాయిటర్స్ ప్రకటించింది.

    అయితే ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. కియా మోటర్స్ వ్యవహారంపై మరోసారి ఆయన చంద్రబాబుపై సెటైర్లు వేశారు. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్‌ను కూడా మేనేజ్‌ చేసి కియా కార్ల ఫ్యాక్టరీ తరలిపోతుందంటూ వార్త రాయించి పుకార్లు లేవదీశాడంటూ బాబుపై ఆయన మండిపడ్డారు. సీఎంగా ఉండగా ప్రజా ధనంతో ఆ సంస్థకు ప్రయోజనాలు కల్పించి ఇప్పుడు ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నాడని ఆరోపణలు చేశారు. అన్ని వ్యవస్థలతో పాటూ మీడియాను కూడా భ్రష్టు పట్టించాడు అంటూ... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి.


    రెండు రోజుల క్రితం ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోతుందంటూ రాయిటర్స్ ప్రకటన చేసింది. ఏపీలో ఉన్న తన 1.1 బిలియన్ డాలర్ల విలువైన ప్లాంట్‌ను పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రానికి మార్చేందుకు కియా చర్చలు జరుపుతున్నట్లు రాయిటర్స్ సంచలన కథనం రాసింది. దీంతో రాయిటర్స్ చేసిన ప్రకనట ఏపీలో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది.


    రాయిటర్స్ చేసిన మొదటి ట్వీట్. దాని సవరణ
    Published by:Sulthana Begum Shaik
    First published:

    అగ్ర కథనాలు