చంద్రబాబుకు విజయసాయిరెడ్డి చురకలు.. మొదటి లేఖ దాని కోసమా అంటూ..

అమరావతిలోని ప్రజావేదిక భవనాన్ని తన నివాసంగా కేటాయించాలని చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాయడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్య ట్వీట్ చేశారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 6, 2019, 12:45 PM IST
చంద్రబాబుకు విజయసాయిరెడ్డి చురకలు.. మొదటి లేఖ దాని కోసమా అంటూ..
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 6, 2019, 12:45 PM IST
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. అమరావతిలోని ప్రజావేదిక భవనాన్ని తన నివాసంగా కేటాయించాలని చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి.. ‘సీఎం జగన్ గారికి చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యలపైన ఉంటుందనుకున్నాం. 40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా, పోతుందా అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్టుంది. ప్రపంచం మొత్తాన్నిఅమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?’ అంటూ వ్యంగంగా ట్వీట్ చేశారు. మరోవైపు, టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు సాహసోపేత నిర్ణయమని ఏపీ సర్కార్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు.

కాగా, విజయసాయిరెడ్డికి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా జగన్ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. లోక్‌సభాపక్ష నేతగా రాజంపేట ఎంపీ, తన సన్నిహితుడు మిథున్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్‌గా రాజమండ్ర ఎంపీ మార్గాని భరత్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు.First published: June 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...