Home /News /politics /

YSRCP MP VIJAYASAI REDDY SLAMS CHANDRABABU NAIDU OVER AMARAVATI AGITATIONS

ఏపీకి ఒక్క మేలూ చేయలేదు..చంద్రబాబుపై వైసీపీ ఎంపీ ధ్వజం

విజయసాయిరెడ్డి (File)

విజయసాయిరెడ్డి (File)

పదవిలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జీవో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతిదీ కమిషన్లు, వాటాల కోసమేనంటూ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విజయసాయి ఆరోపణలు గుప్పించారు.

    అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. అమరావతి నుంచి రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలం అవుతుందని చంద్రబాబు అతిగా ఊహించుకున్నారని ఎద్దేవా చేశారు. తన పిలుపును ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’ను వీధుల్లోకి వదిరారని, వీరంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులేనని మండిపడ్డారు.  పదవిలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జీవో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతిదీ కమిషన్లు, వాటాల కోసమేనంటూ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విజయసాయి ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు దోపిడీ వ్యవహారాలు ఇప్పుడు సాక్ష్యాధారాలతో వెలుగు చూస్తుంటే కులం, కక్ష అంటూ ఆయన అనుకూల మీడియా బట్టలు చించుకుంటోందని విమర్శించారు.





    అమరావతితో సంబంధంలేని మహిళలతో దాడులు చేయించడమా? 40 ఏళ్ల అనుభవం అంటే అని ప్రశ్నించారు. ప్రజలు అధికారం నుంచి దించినప్పటి నుంచి ఏదో ఒక విధ్వంసానికి కుట్రపన్నడం తప్ప..రాష్ట్రానికి మేలు చేసే పని ఒక్కటైనా చేశారా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతవని చెప్పుకోవడానికే చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. మరో ఏడాదిలో ఇక్కడ అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను అన్ని రాష్ట్రాలు అనుసరిస్తాయని అన్నారు. సీఎం జగన్ పాలనలో ఏపీ రోల్ మోడల్ అవుతుందని విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

    Published by:Janardhan V
    First published:

    Tags: Chandrababu naidu, Vijayasai reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు