ఆ టెన్షన్‌తోనే సంక్రాంతి వేడుకలకు చంద్రబాబు దూరం..వైసీపీ ఎంపీ

ఆ టెన్షన్ కారణంగానే టీడీపీ అధినేతళ చంద్రబాబు నాయుడు సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్నారంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

news18-telugu
Updated: January 18, 2020, 11:29 AM IST
ఆ టెన్షన్‌తోనే సంక్రాంతి వేడుకలకు చంద్రబాబు దూరం..వైసీపీ ఎంపీ
అమరావతి రైతులకు సంఘీభావంగా చంద్రబాబు నాయుడు దంపతులు నిరసన
  • Share this:
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉండడం తెలిసిందే. రాజధాని తరలింపు ప్రయత్నాల నేపథ్యంలో అమరావతి గ్రామాల రైతులకు బాసటగా నిలుస్తూ సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే చంద్రబాబు నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. రూ.10 లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ సంపద హుష్ కాకి అవుతుందనే టెన్షన్ ముందు చంద్రబాబుకి సంక్రాంతి పండగ ఎంత అంటూ ఎద్దేవా చేశారు. డబ్బుంటే ప్రతి క్షణం ఉత్సవమే అనేది చంద్రబాబు, ఆయన వర్గీయుల ప్రగాఢ విశ్వాసంగా విమర్శించారు. డబ్బు కోసం చంద్రబాబు ఇటు వాళ్లను అటు పంపిస్తాడు..తటస్థులను తెరపైకి తెస్తాడంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.

కాగా పీడీ యాక్ట్‌ను ఏపీ సర్కారు పొడగించడంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను విజయసాయి రెడ్డి తిప్పికొట్టారు. 2014-19 మధ్యకాలంలో టీడీపీ సర్కారు 20 సార్లు పొడగించిన పీడీ యాక్ట్‌ను ఇప్పుడు రొటీన్‌గా తమ ప్రభుత్వం పొడగించిందని చెప్పుకొచ్చారు.

First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు