ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై మరోసారి ట్విట్టర్లో తనదైన శైలిలో విమర్శించారు వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి. చిత్తుగా ఓడి కూడా ‘హింసించే రాజు 23వ పులకేశి’ లాగా లోకేశ్ ప్రజలను టార్చర్ చేస్తున్నాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చేసిన చవకబారు విమర్శలనే మళ్లీ వదులుతున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కొడుకు కాబట్టి దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టిన నారా లోకేశ్... మూడు శాఖలను భ్రష్టు పట్టించాడని ధ్వజమెత్తారు. కీచురాళ్ల రొద లాగా ఏవేవో విషయాలను ట్వీట్ చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు, ఆయన శిష్య గణానికి ప్రతిదీ నెగెటివ్‌గా కనిపించడానికి ‘రిటైర్మెంట్ సిండ్రోమ్’ కారణమని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పదవులు పోవడం, ప్రజలు పట్టించుకోకపోవడం, మొన్నటి వరకు ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించిన వారంతా అదృశ్యమవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందని సెటైర్ వేశారు. ఈ సిండ్రోమ్ నుంచి బయట పడటం అంత తేలికేమీ కాదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.