‘నిమ్మగడ్డ కోసం రెండు డజన్ల మంది అడ్వకేట్లు’

నిమ్మగడ్డ లాంటి వ్యక్తి SECగా ఉంటే ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయదని ప్రజలనుకుంటున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: June 2, 2020, 5:06 PM IST
‘నిమ్మగడ్డ కోసం రెండు డజన్ల మంది అడ్వకేట్లు’
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (ఫైల్ ఫోటో)
  • Share this:
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ లాంటి వ్యక్తి SECగా ఉంటే ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయదని ప్రజలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవి నుంచి దిగిపోయాడని చంద్రబబాబు రెండు డజన్ల మంది అడ్వొకేట్లను రంగంలోకి దింపాడని విజయసాయిరెడ్డి వ్యంగ్యస్త్రాలు సంధించారు. నిమ్మగడ్డ కోసం ఆయనెందుకు హైరానా పడుతున్నాడో ? అని కామెంట్ చేశారు.మరోవైపు నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను మళ్లీ ఏపీ ఎస్ఈసీగా నియమించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇందులో నిమ్మగడ్డ రమేశ్, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి, జస్టిస్‌ వి.కనగరాజ్‌ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది.


First published: June 2, 2020, 4:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading