టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. యజమాని ఆర్డరేస్తేనే ప్యాకేజీ స్టార్ బిజెపి చుట్టూ తిరుగుతున్నాడని పరోక్షంగా పవన్ కళ్యాణ్‌పై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర బిజెపిని తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ముందుగా పావలాను చంద్రబాబు పంపిస్తున్నాడని సెటైర్లు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలానికి పొత్తు వల్ల ఒరిగేదేమి లేకున్నా... సైకిల్ పార్టీకి మేలు జరిగేలా చూసుకోవాలనేది చంద్రబాబు ఎత్తుగడగా కనిపిస్తోందని విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
యజమాని ఆర్డరేస్తేనే ప్యాకేజీ స్టార్ బిజెపి చుట్టూ తిరుగుతున్నాడు. రాష్ట్ర బిజెపిని తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ముందుగా పావలాను పంపిస్తున్నాడు బాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలానికి పొత్తు వల్ల ఒరిగేదేమి లేకున్నా సైకిల్ పార్టీకి మేలు జరిగేలా చూసుకోవాలనేది బాబు ఎత్తుగడ.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 14, 2020
అమరావతిని ఎలా మారుస్తారని చంద్రబాబు పళ్లు కొరికారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారని... ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించారని ఆరోపించారు. బంగారు నగల సేకరణకు దిగారని... తర్వాత జోలెతో ఊరూరూ తిరుగుతున్నారని అన్నారు. ఆఖరున వచ్చిన డబ్బును పంచుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లి పోతారని చంద్రబాబును ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu naidu, Pawan kalyan, Vijayasai reddy, Ysrcp