మహా రాజకీయాల్లో చంద్రబాబు చక్రం... వైసీపీ ఎంపీ సెటైర్

చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు సెటైర్లు వేసే విజయసాయిరెడ్డి... తాజాగా చంద్రబాబును మహారాష్ట్ర రాజకీయాలతో ముడిపెట్టి విమర్శలు గుప్పించారు.

news18-telugu
Updated: November 12, 2019, 12:40 PM IST
మహా రాజకీయాల్లో చంద్రబాబు చక్రం... వైసీపీ ఎంపీ సెటైర్
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై వ్యంగస్త్రాలు సంధించడంలో మిగతా వారికంటే ముందుంటారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు సెటైర్లు వేసే విజయసాయిరెడ్డి... తాజాగా చంద్రబాబును మహారాష్ట్ర రాజకీయాలతో ముడిపెట్టి విమర్శలు గుప్పించారు. తెలంగాణా,ఆంధ్రా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి చంద్రబాబు చెల్లని కాసు అయిపోయాడని విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. లేదంటే ముంబాయిలో తిష్ట వేసి నాలుగు భిన్నపక్షాలను ఏకం చేసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తా అని చిటికెలేసేవాడని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు సారు పాదం మోపితే శని దేవత జిడ్డులా పట్టుకుంటుందని తెలిసిపోవడంతో ఎవరూ ఫోన్లు కూడా ఎత్తడం లేదంట అని సెటైర్ వేశారు. మరి... చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ట్వీట్‌కు టీడీపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

First published: November 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు