కేసీఆర్ చెన్నై వెళ్లి స్టాలిన్ను కలిసి తరువాత చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని ఆరోపించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి... త్వరలోనే చంద్రబాబు కూడా స్టాలిన్ను కలుస్తారని అన్నారు.
వైసీపీని నుంచి టీడీపీని టార్గెట్ చేయడంలో అందరికంటే ముందుండే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి... మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై సెటైర్లు వేశారు. కేసీఆర్ చెన్నై వెళ్లి స్టాలిన్ను కలిసి తరువాత చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని ఆరోపించిన వైసీపీ ఎంపీ... త్వరలోనే ఆయన కూడా స్టాలిన్ను కలుస్తారని అన్నారు. స్టాలిన్ను కలిసి ఫెడరల్ ఫ్రంట్లో తాము భాగస్వామ్యం కాబోమని ప్రకటించేంత వరకు చంద్రబాబు ఊరుకోడని విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయినా రెండు సీట్లు కూడా గెలవడం కష్టమే అనుకునే పార్టీని ఎవరూ లెక్క చేస్తారంటూ చంద్రబాబును స్టాలిన్ పట్టించుకోబోరని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
స్టాలిన్ ను కెసీఆర్ కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారని మీడియాలో వచ్చింది. ఇక చంద్రం సారుకు నిద్ర పట్టదు. స్టాలిన్ ను తనూ కలిసి అటువంటిదేమి లేదు అని ప్రకటించేదాకా ఊరుకోడు. 2 ఎంపీ సీట్లు కూడా కష్టమేనని తెలిశాక ఎవరు లెక్కచేస్తారు ఈయన పిచ్చి కాకపోతే.
సోమవారం చెన్నై వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ను కలిసి ఫెడరల్ ఫ్రంట్ అంశంపై చర్చించారు. అయితే తాము జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్తో కలిసి ముందుకు సాగుతామని స్టాలిన్ కేసీఆర్కు వివరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.