YSRCP MP VIJAYASAI REDDY REACTION ON UNION BUDGET 2019 AK
ఏపీకి అన్యాయం...ఓవరాల్‌గా ఓకే...బడ్జెట్‌పై వైసీపీ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)
Vijayasai reddy on union budget 2019 | విభజన కారణంగా నష్టపోయిన ఏపీని ఆదుకుంటామని కేంద్ర పెద్దలు హామీ ఇచ్చారని... కానీ బడ్జెట్లో మాత్రం ఇందుకు సంబంధించిన ఎలాంటి అంశాలు కనిపించడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ ఎంపీలు పెదవి విరిచారు. బడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయింపు గురించి ప్రస్తావన లేకపోవడంపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. విభజన కారణంగా నష్టపోయిన ఏపీని ఆదుకుంటామని కేంద్ర పెద్దలు హామీ ఇచ్చారని... కానీ బడ్జెట్లో మాత్రం ఇందుకు సంబంధించిన ఎలాంటి అంశాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ప్రకటన చేసిందని... అయితే అందులో విశాఖ,విజయవాడ మెట్రోలు లేవని ఆయన అన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన విధంగానే ఏపీకి నిధులు కేటాయించారని... ప్రత్యేకంగా ఎలాంటి నిధులు ఇవ్వలేదని అన్నారు. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం బడ్జెట్ బాగుందని అన్నారు. బడ్జెట్లో కేంద్రం ప్రస్తావించిన అనేక అంశాలపై విజయసాయిరెడ్డి సానుకూలంగా స్పందించారు. గృహనిర్మాణం,మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం ఇవ్వడం అభినందించదగ్గ విషయమని అన్నారు. జీరో బడ్జెట్ వ్యవసాయంపై కేంద్రం మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉందని అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.