హోమ్ /వార్తలు /politics /

AP Politics: అలా చేస్తే బీజేపీలో టీడీపీ విలీనం… చంద్రబాబు ప్రతిపాదన.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

AP Politics: అలా చేస్తే బీజేపీలో టీడీపీ విలీనం… చంద్రబాబు ప్రతిపాదన.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhi Ram) చేసిన వ్యాఖ్యలు రాకీయంగా చిచ్చురేపగా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) తీవ్రంగా రియాక్ట్ అయింది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhi Ram) చేసిన వ్యాఖ్యలు రాకీయంగా చిచ్చురేపగా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) తీవ్రంగా రియాక్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలపర్వం తారాస్థాయికి చేరింది. టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్షకు పిలుపునిస్తే... ఆ దీక్షకు సమాంతరంగా వైసీపీ జనాగ్రహ దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ దీక్షల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ముఖ్యనేతలు పాల్గొని టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలే రోడ్లెక్కి నిరసనలకు దిగడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక విశాఖపట్నంలో జరిగిన జనాగ్రహ దీక్షలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  వైసీపీ జనాగ్రహ దీక్షలో ప్రసంగించిన విజయసాయి.. చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు. చంద్రబాబునాయుడు తన స్వలాభం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మోసం చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అసత్య ఆరోపణలను రాష్ట్రప్రజలు నమ్మడం లేదని అందుకే ఢిల్లీ వెళ్తున్నారని విజయసాయి మండిపడ్డారు. అంతేకాదు సీఎం జగన్ ను గద్దెం దించితే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తామని చంద్రబాబు.. బీజేపీ ముఖ్యనేతల వద్ద ప్రతిపాదన పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరాంధ్రలో గంజాయి సాగును ప్రోత్సహించింది టీడీపీనేని ఆయన అన్నారు.

  ఇది చదవండి: పవన్ రాజకీయ వ్యూహం మారబోతోందా..? ఆ పార్టీకి షాకివ్వబోతున్నారా..?


  మరోవైపు గుంటూరులో జరిగిన జనాగ్రహదీక్షలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దీక్షపై ఆయన మండిపడ్డారు. టీడీపీ కార్యాలయాన్ని దేవాలయంగా చెబుతున్న చంద్రబాబు.. ఆ పార్టీ నేతలు బూతులు తిడుటుంతే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బూతులపై ఉద్యమాన్ని నిర్మించాలని చూస్తున్నారని సజ్జల ఆరోపించారు. రాష్ట్రంలో పాలన విధించాలని డిమాండ్ చేస్తూ జగన్ ను గద్దె దించేందుకు చంద్రబాబు కుట్రపన్నారని ఆయన మండిపడ్డారు.

  ఇది చదవండి: ఏపీ రాజకీయలపై ఆర్జీవీ ట్వీట్... నేతలకు అదిరిపోయే సలహా..  ఇదిలా ఉంటే రెండు పార్టీలు ఈ వివాదాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాయి. టీడీపీ ఈ వ్యవహారంపై రాష్ట్రపతితో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన టీడీపీ నేతలు అక్కడి పెద్దల అపాయింట్ మెంట్ కోసం యత్నిస్తున్నారు. శుక్రవారం రాత్రి దీక్ష ముగిసిన వెంటనే చంద్రబాబు శనివారం ఢిల్లీ వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అధికార పార్టీ కూడా టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపింది. త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఈసీకి లేఖ అందిస్తామని చెబుతోంది. ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Bjp-tdp, Vijayasai reddy, Ysrcp

  ఉత్తమ కథలు