చంద్రబాబుది మామూలు గుండె కాదు.. విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబుది మామూలు గుండె కాదంటూ ఆయన ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: February 27, 2020, 2:43 PM IST
చంద్రబాబుది మామూలు గుండె కాదు.. విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
విజయసాయిరెడ్డి, చంద్రబాబు
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబుది మామూలు గుండె కాదంటూ ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబుపై, టీడీపీపై ట్విట్టర్‌లో కౌంటర్లు, విమర్శలు చేసే ఆయన మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై తన విమర్శలు సంధించారు. అయితే, ఈ క్రమంలో బాబుది మామూలు గుండె కాదంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. ప్రజా చైతన్య యాత్ర(Praja Chaitanya Yatra) ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఈ రోజు ఉదయం విశాఖకు చేరుకున్నారు. అయితే.. భారీ ఎత్తున వైసీపీ నేతలు ఆయన్ను అడ్డుకున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలు ఎన్ని అవాంతరాలు సృష్టించిన ప్రజా చైతన్య యాత్ర చేసి తీరుతానని, అందరి భరతం పడతానని వ్యాఖ్యానించారు.

అందరి భరతం పడతానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి స్పందించారు. అధికారం కోల్పోయిన నిస్సహాయతలో ఇలా మాట్లాడుతున్నారంటూ.. మరింత దిగజారిపోవచ్చన్న రీతిలో ఎద్దేవా చేశారు. ‘కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తనే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు’ అని బెదిరిస్తున్నాడంటే మామూలు ‘గుండె’ కాదు!’ అని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ జోరుగా వైరల్ అవుతోంది.

Published by: Shravan Kumar Bommakanti
First published: February 27, 2020, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading