ఏపీలోని అధికార వైసీపీ, విపక్ష వైసీపీ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. టీడీపీ తరపున చంద్రబాబు తనయుడు,ఏపీ మాజీమంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్, వైసీపీపై విరుచుకుపడుతుంటే... టీడీపీ నేతలపై ఎప్పటిలాగే ట్విట్టర్లో తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి. తాజాగా మాజీమంత్రి లోకేశ్, దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది ఎద్దేవా చేశారు. స్థాయికి మరచి చెలరేగుతున్నారని విమర్శించారు.
మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారని... ఇప్పడు అదే చిదంబరం, ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారని వ్యాఖ్యానించారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. విజయవాడలో దోమల గుంపుల రియల్ టైమ్ డ్యాటా, అవి ఆడో మగో తెలుసుకోవడానికి రూ.1.5 కోట్లు నాకేశారని ధ్వజమెత్తారు. ప్రపంచంలో ఎక్కడా దోమల డేటా సేకరించే మూర్ఖపు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవని అన్నారు. దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయస్వాహ చేయడం మొదటిసారి వింటున్నామని మండిపడ్డారు.
జగన్ను ఉద్దేశించి విధి క్రూరమైందని ఏదో అనబోయి దేవినేని ఉమా ఆగారన్న విజయసాయిరెడ్డి... చేతబడి గాని మొదలుపెట్టావా ఏంటి అంటూ ఆయనకు కౌంటర్ ఇచ్చారు. మంత్రిగా పనిచేస్తూ దేవినేని ఉమ అన్న రమణ రైలు ప్రమాదంలో మరణించారన్న విజయసాయిరెడ్డి... ఉమ వదిన గారిది సహజ మరణం కాదంటారని అన్నారు. దుర్మార్గాలతో ఈ స్థాయికి చేరావంటే విధి ఎంత దయలేనిదో తెలియటం లేదూ అంటూ ఉమపై సెటైర్లు వేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.