సీఎం జగన్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనూ ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.
చంద్రబాబు పిల్లి శాపాలకు ఉట్లు తెగవన్న విజయసాయిరెడ్డి... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం వీలు కాదంటున్నారని, తన వల్ల కాని పనులను ఇంకెవరూ చేయలేరన్నట్టు చెప్పడం ఎందుకని మండిపడ్డారు.
ఏపీ మాజీమంత్రి నారా లోకేశ్, వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. ఎల్లంపల్లిలో అవినీతి జరిగిందంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారంటూ ఏపీ సీఎం జగన్ అనడాన్ని ట్విట్టర్లో లోకేశ్ తప్పుబట్టారు. చంద్రబాబుపై ఆరోపణలు చేయడమంటే ఆకాశంపై ఉమ్మేయడమే అని కామెంట్ చేశారు. దీనిపై రియాక్టయిన విజయసాయిరెడ్డి... ట్విట్టర్లో తనదైన శైలిలో స్పందించారు. ‘చంద్రబాబు గారేమో ఆకాశమంట, లోకేశేమో మిరుమిట్లు గొలిపే నక్షత్రమంట. ఆకాశంపై ఉమ్మేయొద్దని సలహా ఇస్తున్నాడు. అందనంత స్థాయి అని మీకు మీరే పొగుడుకుంటున్నారా మందలగిరి మారాజా?’ అని లోకేశ్‌కు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు పిల్లి శాపాలకు ఉట్లు తెగవన్న విజయసాయిరెడ్డి... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం వీలు కాదంటున్నారని, తన వల్ల కాని పనులను ఇంకెవరూ చేయలేరన్నట్టు చెప్పడం ఎందుకని మండిపడ్డారు. అన్నమాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపిస్తారని, అందరు చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. లింగమనేని గెస్ట్‌హౌస్‌ను ల్యాండ్‌పూలింగ్‌లో సేకరించి ప్రభుత్వ అతిథి గృహంగా మార్చినట్టు మార్చి 6, 2016 న చంద్రబాబు ప్రకటించారని, కానీ రికార్డుల్లో మాత్రం అది ఇప్పటికీ లింగమనేని పేరునే ఉందని అన్నారు. దీని మరమ్మత్తుల కోసం రూ.8 కోట్లు ఖర్చుపెట్టారని, ఇంతకీ ఆ ఇల్లు ఎవరిదో చంద్రబాబే చెప్పాలని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.