‘రూ. 100 కోట్లు మింగేసిన చంద్రబాబు, లోకేశ్‌’

టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలన్న విజయసాయిరెడ్డి... త్యాగాలు మీవి... భోగాలు వారివి అని విమర్శించారు.

news18-telugu
Updated: May 6, 2020, 12:45 PM IST
‘రూ. 100 కోట్లు మింగేసిన చంద్రబాబు, లోకేశ్‌’
నారా లోకేష్, చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆరోపణలు గుప్పించారు. విశాఖ హుదూద్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు పలువురు కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుంచి అప్పట్లో ఏకంగా రూ. 100 కోట్లు వరకు ఎన్టీఆర్ ట్రస్టులోకి లాగారని ఆరోపించారు. తుఫాను బాధితులకు పంచకుండా పెదబాబు, చినబాబు ఈ మొత్తం మింగేశారని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు పేరిట తండ్రీ కొడుకుల అసాంఘిక కార్యకలాపాల మీద పూర్తి స్థాయి కోరుతున్నానని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.



టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలన్న విజయసాయిరెడ్డి... త్యాగాలు మీవి... భోగాలు వారివి అని విమర్శించారు. చంద్రబాబుకు పావులుగా ఉపయోగపడిన నాయకులు, కార్యకర్తలు నిలదీయాలని అన్నారు. మీరిచ్చిన విరాళాలు ఎటు పోయాయో అడగాలని అన్నారు.




First published: May 6, 2020, 12:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading