అందుకే చంద్రబాబు ఏడుపు... మండిపడ్డ వైసీపీ ఎంపీ

ఏదైనా హామీ ఇస్తే ఎంత త్వరగా నెరవేర్చాలా అని సీఎం జగన్ ఆరాటపడతారని... ఎలా మోసగించాలా అని చూడటం చంద్రబాబు నైజమని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

news18-telugu
Updated: April 23, 2020, 1:38 PM IST
అందుకే చంద్రబాబు ఏడుపు... మండిపడ్డ వైసీపీ ఎంపీ
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసే రిపోర్టులో కరోనా నియంత్రణ, చికిత్సకు తీసుకుంటున్న జాగ్రత్తల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. కొరియా కిట్లు వచ్చాక వ్యాధి కట్టడి ఇంకా తేలికవుతుందని ఆయన అన్నారు. ప్రజలు నిశ్చింతగా ఉంటే సీఎం జగన్‌కు ఎక్కడ పేరొస్తుందోనని బాబు ఏడుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు బిజెపిలోకి పంపిన సొంత మనిషి ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకని కోర్టుకెళ్లి జీఓను కొట్టేయించాడని విజయసాయిరెడ్డి అన్నారు. గ్లాసు పార్టీపై ఎంపీగా పోటీ చేసిన నేత కరోనా సమయంలో పోలవరం పనులెలా కొనసాగిస్తారని సుప్రీంలో పిటీషిన్ వేశాడని ఆరోపించారు. ప్రజలపై ఎందుకింత ద్వేషమని, వీరి వెనుక ఉన్నదెవరని ఆయన ప్రశ్నించారు.డ్వాక్రా గ్రూపులకు సున్నా వడ్డీ పథకం కింద రూ.1400 కోట్లు జమ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. 90.37 లక్షల మంది మహిళలు తక్షణం ప్రయోజనం పొందుతారని అన్నారు. ఏదైనా హామీ ఇస్తే ఎంత త్వరగా నెరవేర్చాలా అని సీఎం జగన్ ఆరాటపడతారని... ఎలా మోసగించాలా అని చూడటం చంద్రబాబు నైజమని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రజలకు ఆ తేడా అర్థమైందని ఆయన వ్యాఖ్యానించారు.
First published: April 23, 2020, 1:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading