Home /News /politics /

YSRCP MP VIJAYASAI REDDY COMMENTS ON CHANDRABABU NAIDU AK 2

శిఖండిని అడ్డుపెట్టుకుని... చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ ఎంపీ

అయితే చంద్రబాబు చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న చిత్తూరు జిల్లా పోలీసులు.. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.

అయితే చంద్రబాబు చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న చిత్తూరు జిల్లా పోలీసులు.. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.

నిజంగా కరోనా భయానికే ఎన్నికలు వాయిదా వేసి ఉంటే చంద్రబాబు స్టేట్‌మెంట్లు మరోలా ఉండేవని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

    ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శిఖండిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేసే యుద్ధం ఎల్లో మీడియాను ఉత్సాహపరుస్తుందని... కానీ పరాజయాన్ని మాత్రం నిలువరించలేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎప్పుడు జరిగినా వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టడం ఖాయమని అన్నారు. ఎన్నికలు వాయిదా వేసి పరువు నిలబెట్టినందుకు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఫోటోకు టీడీపీ కార్యకర్తలు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చాటుకున్నారని అన్నారు.



    నిజంగా కరోనా భయానికే ఎన్నికలు వాయిదా వేసి ఉంటే చంద్రబాబు స్టేట్‌మెంట్లు మరోలా ఉండేవని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. వాయిదాతో పరాజయ భారాన్ని కొద్ది రోజులు తప్పించుకున్నాడని ఎద్దేవా చేశారు. ఎలక్షన్ కోడ్ ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుపేదలకు ఊరట కలిగించాయిని విజయసాయిరెడ్డి అన్నారు. పంపిణీ చేసే స్థలాల్లో గృహ నిర్మాణం కోసం సిమెంట్ ధరలను భారీగా తగ్గించేలా కంపెనీలను ఒప్పించడం సీఎం జగన్ గొప్ప విజయమని కొనియాడారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Tdp, Vijayasai reddy, Ysrcp

    తదుపరి వార్తలు