రాజధాని తరలింపుపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

విశాఖకు రాజధాని తరలింపు అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: April 21, 2020, 2:42 PM IST
రాజధాని తరలింపుపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ రాజధానిని విశాఖకు తరలించే అంశంపై గతంలోనే నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం... ఎప్పుడు విశాఖకు రాజధానిని మారుస్తుందనే దానిపై మళ్లీ చర్చ మొదలైంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలోనూ రాజధానిని తరలించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కొద్దిరోజులుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలు ఎలా ఉన్నా... తాజాగా ఈ అంశంపై వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విశాఖకు వచ్చి తీరుతుందని స్పష్టం చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి... దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదని వ్యాఖ్యానించారు.

అయితే అది ఎప్పుడు అనే అంశంపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. నేడు విశాఖలో మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి... ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గంలోని మంగమారిపేట గ్రామంలో 700 మత్స్యకార కుటుంబాలకు ఎంపీ విజయసాయిరెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తనపై విమర్శలు గుప్పించిన బీజేపీ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, ఎంపీ సుజనా వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

First published: April 21, 2020, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading