‘అచ్చెన్నాయుడును ఇరికించిన చిట్టినాయుడు’

అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే కిడ్నాపు ఎలా అవుతుందని చంద్రబాబును ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.

news18-telugu
Updated: June 12, 2020, 8:09 PM IST
‘అచ్చెన్నాయుడును ఇరికించిన చిట్టినాయుడు’
అచ్చెన్నాయుడు (File)
  • Share this:
అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. టీడీపీ అధ్యక్ష పదవికి ఎర్రన్న కుటుంబం పోటీకి వస్తోందని రూ. 900 కోట్ల మందుల కొనుగోళ్ల కుంభకోణంలో కీలక డాక్యూమెంట్లని చిట్టినాయుడు టీం లీక్ చేసిందని విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేయించటం, వాటాలు పంచుకోవడం, అడ్డం అని అనుమానం రాగానే లీకులిచ్చి ఇరికించడం అని ఆరోపించారు. అచ్చెన్న ఎవరెవరు వాటాలు పంచుకున్నారో ఏసీబీకి వెల్లడించాలని వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేస్తే కిడ్నాపు ఎలా అవుతుందని చంద్రబాబును ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.అచ్చెన్న కుటుంబ సభ్యులు సైతం ఆ మాట అనలేదని అన్నారు. గొడవలు సృష్టించాలనే కుట్రతోనే కిడ్నాప్ అని అరిచారని ఆరోపించారు. అరెస్ట్ ప్రోటోకాల్స్ అన్నిటీనీ ACB పాటించిందని విజయసాయిరెడ్డి వెల్లడించారు. స్కామ్‌లో మీ పాత్ర బయట పడతుందనే భయంతోనే బట్టలు చించుకుంటున్నారని కామెంట్ చేశారు. దిగువ స్థాయి కార్మికులు, వారు పనిచేసే సంస్థలు చెల్లించే కంట్రిబ్యూషన్ తో నడిచే ESI లో రూ. 900 కోట్ల అవినీతికి పాల్పడం సిగ్గు చేటు అని విమర్శించారు. హెరిటేజ్ నెయ్యి కొనుగోలులో లీటరుకు రూ.150 ఎక్కువ వసూలు చేశారని... ప్రజాధనం ఉన్నది దోచుకోవడానికే అన్నట్టు చంద్రబాబు పాలన సాగిందని ఆరోపించారు.
First published: June 12, 2020, 8:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading