బీజేపీలో టీడీపీ విలీనం... వైసీపీ ఎంపీ తీవ్ర విమర్శలు

Vijayasai reddy comments | దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరానికి అన్ని అనుమతులు తెచ్చి పనులు ప్రారంభించారని... పట్టుదలతో చేస్తే ప్రాజెక్ట్‌ మూడేళ్లలో పూర్తయ్యేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: August 8, 2019, 11:56 AM IST
బీజేపీలో టీడీపీ విలీనం... వైసీపీ ఎంపీ తీవ్ర విమర్శలు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: August 8, 2019, 11:56 AM IST
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా అని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాక మీకు మీరు గోమాతగా అభివర్ణించుకోవడం పెద్ద జోక్ అని సెటైర్ వేశారు. అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టీడీపీని బిజెపిలో విలీనం చేస్తానని రాయబారాలు పంపింది మీరే కదా చంద్రబాబుపై ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డి. ఇందులో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపీలోకి పంపించారని ఆరోపించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరానికి అన్ని అనుమతులు తెచ్చి పనులు ప్రారంభించారని... పట్టుదలతో చేస్తే ప్రాజెక్ట్‌ మూడేళ్లలో పూర్తయ్యేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.7లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్తు తయారయ్యేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని అన్నట్టు దాన్నో ఏటీఎంలా భావించారే తప్ప పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ కోశానా లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న ఐదున్నరేళ్లు వర్షాలకు కొదవ లేదని... జలాశయాలన్నీ నిండి రెండు పంటలు పండాయని విజయసాయిరెడ్డి అన్నారు. ఇప్పుడు మళ్లీ రాజన్న రాజ్యం వచ్చిందని... రిజర్వాయర్లన్నీ నిండుతున్నాయని అన్నారు. రైతుల మోముల్లో ఒక భరోసా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.






First published: August 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...