టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి. సీఎం జగన్ విలువలకు కట్టుబడిన మొండి మనిషి కాబట్టి సరిపోయిందని... గేట్లు తెరిచుంటే ఈ పాటికి అంతా జంప్ అయ్యేవారని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఆఖరికి మాలోకాన్ని కూడా పంపించి కేసుల నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు చూసేవారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కష్టాలు ఎల్లో మీడియాకు జీవన్మరణ సమస్యలై పోయాయాని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కౌన్సిల్ రద్దుపై సిఎం జగన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్సీల కదలికలపై కుల మీడియా నిఘా పెట్టిందని విమర్శించారు. ఇళ్ల చుట్టూ తమ ప్రతినిధులను మోహరించి బాబుకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు.
సిఎం జగన్ గారు విలువలకు కట్టుబడిన మొండి మనిషి కాబట్టి సరిపోయింది. గేట్లు తెరిచుంటే ఈ పాటికి అంతా జంప్ అయ్యేవారే. మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఆఖరికి మాలోకాన్ని కూడా పంపించి కేసుల నుంచి తప్పించుకోవాలని చూసేవాడు చంద్రబాబు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 27, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nara Lokesh, Tdp, Vijayasai reddy, Ysrcp